టైమ్ లైన్ ఫిక్స్ చేసుకున్న జక్కన్న...!

మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ ప్యాన్ ఇండియా ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుంటే, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు సంబంధించిన క‌ల్పిత క‌థాంశంతో రూపొందుతోన్న చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

కాగా.. సినిమా విడుదలకు కరెక్ట్‌గా దాదాపు ఎనిమిది నెల‌ల స‌మ‌యం ఉంది. సెన్సార్‌, ప్ర‌మోష‌న్స్ అన్నీ పోనూ ఏడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండొచ్చు. మ‌రి ఈ టైమ్ లైన్‌ను రీచ్ కావాలంటే.. రాజ‌మౌళి స్పీడు మ‌రింత పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నాడట‌. మార్చి చివ‌రికంతా ప్యాచ్ వ‌ర్క్ స‌హా ఎంటైర్ షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని డిసైడయ్యాడ‌ట జ‌క్క‌న్న‌. త‌ర్వాత ఆరు నెల‌ల పాటు కేవ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పైనే కూర్చోవాల‌నుకుంటున్నాడ‌ట‌. కోవిడ్ ప్ర‌భావంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఇక టైమ్ లైన్ పెట్టుకుని పని చేసుకోవాల్సింది వస్తుంది జక్కన్న.

More News

స్టైలిష్ స్టార్ కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌యత్నాలు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఈయ‌న‌తో ఓ డిఫ‌రెంట్ సినిమా చేయాల‌ని కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఆలోచ‌న చేశాడ‌ట‌.

బాల‌కృష్ణ 106... ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో డీల్ పూర్తి..!

సూప‌ర్ హిట్ కాంబినేష‌న్స్‌కి ఉండే క్రేజే వేరు. సినిమా సెట్స్‌పై ఉండ‌గానే బిజినెస్ డీల్స్ పూర్తై పోతుంటాయి.

‘రాధేశ్యామ్‌’ టీజ‌ర్ కోసం పూజా హెగ్డే డ‌బ్బింగ్‌...

రెబల్‌స్టార్ ప్ర‌భాస్, పూజా హెగ్డే జోడీగా న‌టిస్తోన్న పీరియాడిక్ లవ్ స్టోరి‘రాధేశ్యామ్‌’. ఈ సినిమా టీజ‌ర్‌ను వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దు: అమిత్ షాకు పవన్ వినతి

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.

‘ఇండియన్2’ నుంచి వాకౌట్ చేసిన స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌

సౌత్ ఇండియాలో భారీ చిత్రాల ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ శంక‌ర్ ఇప్పుడు ‘ఇండియన్2’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.