close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ టెక్నిక్‌లో రాజ‌మౌళి..!

Thursday, February 20, 2020 • తెలుగు Comments

‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ టెక్నిక్‌లో రాజ‌మౌళి..!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఎన్టీఆర్ జ‌త‌గా బ్రిట‌న్ భామ‌ ఒలివియా మోరిస్ న‌టిస్తుంటే.. రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. కాగా..ఈ ఏడాది సినిమా విడుద‌ల ఉంటుంద‌నుకుంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8కి సినిమా వాయిదా ప‌డటంతో అభిమానులు నిరుత్సాహ ప‌డ్డారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఓ పోస్ట‌ర్ మిన‌హా సినిమాలో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు సంబంధించిన లుక్స్ ఏవీ లేక‌పోవ‌డంతో ప‌లు సంద‌ర్భాల్లో అభిమానులే త‌మ చేతివాటం చూపించారు. అయితే ఈసారి అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌మౌళి ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ మార్చుకుంటున్నాడ‌ట‌. అందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఓ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను సిద్ధం చేయాల‌ని అనుకుంటున్నాడ‌ని టాక్‌. సాధార‌ణంగాబాలీవుడ్ సినిమాలకు ఇలాంటి ప్రమోషనల్ సాంగ్స్ ఉంటాయి. అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కోసం జక్కన్న ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Get Breaking News Alerts From IndiaGlitz