‘కిలికి’ భాష వచ్చేసిందోచ్.. కంగ్రాట్స్ మధు!

  • IndiaGlitz, [Friday,February 21 2020]

ఓటమెరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా డైరెక్టర్‌గా జక్కన్నకు ఎంతో పేరు సంపాదించి పెట్టింది.. అంతేకాదు డార్లింగ్ ప్రభాస్, రానాలకు కూడా కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టడానికి ఇప్పటి స్టార్ హీరోలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కవుట్ అవ్వట్లేదు. కొందరైతే రికార్డులు బద్దలు కొట్టేశామని చెప్పుకుంటున్నారు కానీ.. అది ఎంతవరకు నిజమో.

‘కిలికి’ సైట్ లాంచ్..!

ఇక అసలు విషయానికొస్తే.. బాహుబలి సినిమా చూసిన వారికి విలన్ వాడే ‘కిలికి’ భాష గుర్తుండే ఉంటుంది. ఇది సినిమాలో మంచి హైలైట్‌గా కూడా నిలిచింది. ఈ భాషను మ‌ధు కార్కీ చాలా రీసెర్చ్ చేసి మరీ సృష్టించాడు. అలా మంచి ప్రాధాన్యత రావడంతో దీని కోసం.. ఈ భాషను అందరూ నేర్చుకునే విధంగా ఇప్పుడు అందుబాటులోకి రానుంది. అదెలాగంటే.. ‘కార్కి రీసెర్చ్ ఫౌండేషన్, లిఫో బృందం ట్రాన్స్క్రిప్ట్’ రూపొదించడం జరిగింది. నేడు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం కావడంతో ఈ ‘కిలికి’ భాష‌కి సంబంధించిన సైట్‌ని లాంచ్ అయ్యింది. జక్కన్న చేతుల మీదుగానే విడుద‌ల చేయించారు. నాడు ఆయన కష్టపడి రీసెర్చ్ చేయడంతో ఇప్పుడు ఈ భాషను ఔత్సాహికులు నేర్చుకోవడానికి అనువుగా ఉండనుంది. ఇది అతిసులభమైన భాష అని మధు చెబుతున్నాడు. సైట్ లాంచ్ చేసిన అనంతరం పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

శోభు స్పందన!

‘బహుబలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శోభు యార్లగడ్డ ఈ ‘కిలికి’పై స్పందించారు. ‘కంగ్రాట్స్ మధు.. మీ హార్డ్ వర్క్‌ను మెచ్చుకుంటున్నాను. నిజంగా కిలికి భాషను కనిపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకునేందుకు వీలవుతుంది’ అని ట్వీట్ చేశారు. అంటే బాహుబలిలోని ఆ కిలికి భాష ఇప్పుడు అందరూ నేర్చేసుకోవచ్చన్న మాట.

మధు రిప్లై..!

‘మీరు సపోర్టుగా ఉన్నందుకు.. మీ ప్రోత్సాహానికి థ్యాంక్స్ సార్.. థ్యాంక్యూ’ అని శోభు ట్వీట్‌కు మధు రిప్లై ఇచ్చాడు.

More News

ఇటలీలోని డోలమైట్స్ లో  'రెడ్‌' సాంగ్‌ చిత్రీకరణ

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి.

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసిన మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌

‘విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం.. కాలవాంది సొంతం.. పెరిగిందే ఇష్టం..’ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ సాహిత్యానికి అనూప్‌ రూబెన్స్‌ అందించిన స్వరాలు తోడైతే..

'ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య' టీజ‌ర్ విడుద‌ల‌.. ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`.

హిట్ సినిమా సీక్వెల్‌కు సురేందర్ రెడ్డి ప్లాన్!

అవును మీరు వింటున్నది నిజమే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సీక్వెల్ సినిమాకు రెడీగా ఉన్నాడట.

డ్యామిట్ సీన్ రివర్స్.. సుజనా 400 కోట్ల ఆస్తుల వేలం!

సుజనా చౌదరీ గుర్తున్నాడుగా.. అదేనండి 2019 ఎన్ని్కల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలవ్వడం, తన ఆస్తులను సీబీఐ, ఈడీల నుంచి తప్పించుకోవడాకి కమలనాథుల సమక్షంలో