న్యూ ఇయర్ వేళ మెగా - నందమూరి అభిమానులకు చేదువార్త.. 'ఆర్ఆర్ఆర్' వాయిదా..?

అనుకున్నట్లుగానే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమను మరోసారి కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందు పడ్డ ఇండస్ట్రీ నెమ్మదిగా కోలుకుంటున్న వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా షాకిచ్చింది. దేశంలో కేసుల సంఖ్య నానాటికీ తీవ్రమవుతుండటంతో అనేక రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. మరికొన్ని అదే దారిలో నడుస్తున్నాయి. 50 శాతం ఆక్యూపెన్సీతోనే థియేటర్లు నడపడంతో పాటు నైట్ కర్ఫ్యూలు అమల్లోకి రావడంతో రిలీజ్ అవ్వాల్సిన సినిమాల భవిష్యత్ సిందిగ్థంలో పడింది.

ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమపై దీని ప్రభావం బాగా పడే అవకాశం వుంది. సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఈ రెండూ కూడా భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీలే. ప్రస్తుతం దేశంలోని పరిస్ధితుల దృష్ట్యా ఈ రెండు సినిమాలు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధేశ్యామ్‌ను పక్కనబెడితే.. ఆర్ఆర్ఆర్ మాత్రం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నిజం చెప్పాలంటే... ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు మూడుసార్లు వాయిదా పడింది. అప్పుడు దేశంలో కరోనా, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. జనవరి 7న సినిమా విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఓవ‌ర్‌సీస్‌కు ప్రింట్స్ పంపించేశారు. ప్రమోషన్స్ సైతం భారీగా జరుగుతున్నాయి. నోటి దాకా వచ్చిన సమయంలో వాయిదా అంటే నిర్మాతలకు, అభిమానులకు నిరాశే. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆర్ఆర్ఆర్ పోస్ట్‌పోన్ అయ్యిందనే విషయం వాళ్లను డిజప్పాయింట్ చేసేది. రెండు మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్ వాయిదాకి సంబంధించి అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశముంది.

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More News

ఆర్ఆర్ఆర్ నుంచి 'రామం రాఘవం' సాంగ్... అల్లూరిగా నెత్తురు వేడెక్కించిన చరణ్

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా

లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది... ఇక రచ్చ రచ్చే

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మూవీలోని ‘‘లాలా భీమ్లా’’ సాంగ్ డీజే వర్షన్‌ను రిలీజ్ చేశారు. పాటను ప్రముఖ దర్శకుడు

శ్యామ్ సింగరాయ్‌ని వీక్షించిన బాలయ్య.. బాగా తీశారంటూ కితాబు

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘శ్యామ్ సింగరాయ్’’. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయగా..

తెలంగాణ‌లో భారీగా పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌లు.. ఆ థియేటర్‌లో చూడాలంటే రూ.350

ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారు.

కరోనా భారిన పడ్డ విశ్వక్ సేన్: వ్యాక్సిన్ వేసుకున్నా, అప్రమత్తంగా వుండాలంటూ ట్వీట్

భారతదేశంలో మరోసారి కరోనా మహామ్మారి పంజా విసురుతోంది.