close
Choose your channels

తెలంగాణ లొకేష‌న్స్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి ఆరా!!

Monday, June 29, 2020 • తెలుగు Comments

తెలంగాణ లొకేష‌న్స్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి ఆరా!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఈ టెన్ష‌న్‌కు కార‌ణం క‌రోనా. పూణేలో ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ షూటింగ్ చేయ‌డానికి కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేశాడు రాజ‌మౌళి. కానీ క‌రోనా ప్ర‌భావంతో షెడ్యూల్ వాయిదా ప‌డింది. రెండు నెల‌లు దాటినా ప‌రిస్థితి చ‌క్క‌బ‌డ‌లేదు. షూటింగ్స్‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చినా ప‌రిమితులు ఉండ‌టంతో మ‌రో ప్ర‌దేశంలో చిత్రీక‌రించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇప్పుడు రాజ‌మౌళి లొకేష‌న్స్ వేట‌లో ప‌డ్డార‌ట‌. అది కూడా కోట‌లున్న లొకేష‌న్స్ కోసం జ‌క్క‌న్న వెతుకులాట‌లో ఉన్నార‌ట‌.

ఇంతకీ జ‌క్క‌న్న‌కి కోట‌ల్లో చిత్రీక‌రించాల్సిన అవ‌స‌రం ఏంట‌నే విష‌యంలోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్స్‌లో చిత్రీక‌రించాల్సిన స‌న్నివేశాల‌కు కోట‌లు అవ‌స‌రం అయ్యాయి. దీంతో న‌ల్గొండ ప్రాంతంలోని కోట‌ల‌ను రాజ‌మౌళి అండ్ టీమ్ ప‌రిశీలించార‌ట‌. ఆగ‌స్ట్‌లో షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఎన్టీఆర్ ఇందులో కొమురం భీమ్ పాత్ర‌లో.. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆలియా భ‌ట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz