close
Choose your channels

పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌జ‌నీకాంత్‌

Monday, January 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌జ‌నీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ఎంట్రీని బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుంద‌ని.. ఈ చిత్రానికి నార్కాలి అనే టైటిల్ అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌లను ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఖండించారు.

తాజాగా ర‌జ‌నీకాంత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ జోడిగా కీర్తిసురేష్‌ను న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఒక‌వేళ ర‌జ‌నీకాంత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించేది నిజ‌మే అయితే ద‌శాబ్ద‌కాలం త‌ర్వాత ర‌జ‌నీకాంత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించే చిత్ర‌మిదే అవుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై మురుగ‌దాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.