close
Choose your channels

రాజశేఖర్ 92ను ప్రకటించేశారు..

Saturday, February 6, 2021 • తెలుగు Comments

హీరో రాజశేఖర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం వరుసగా సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా తన పుట్టినరోజు సందర్భంగా ‘శేఖర్’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రాన్ని సైతం ప్రకటించారు. తాజాగా ఆయన హీరోగా నటించనున్న 92వ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. కిరణ్‌ కొండమడుగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివానీ, శివాత్మిక, సృజన్‌, హర్ష, భార్గవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇంగ్లీష్ డెయిలీ పేపర్‌పై కూలింగ్‌ గ్లాస్‌, గన్‌, బుల్లెట్స్‌, సిగార్‌, మందుగ్లాసుతో ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పేపర్‌లో ఓ క్రైం వార్త ప్రముఖంగా ప్రచురించబడి ఉంది. పోస్టర్‌ మేకింగ్‌ చూస్తుంటే మరోసారి రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఓటీటీలో విడుదలై ప్రశంసలు అందుకున్న ‘గతం’ సినిమాను నిర్మించిన నిర్మాతలు.. రాజశేఖర్‌ 92వ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయనున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz