అప్పుడే 'మామ ఓ చందమామ' పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం కలిగింది - ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రాజశేఖర్‌

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

యంగ్‌ ఛార్మింగ్‌ హీరో రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ఖాన్‌ హీరోయిన్‌గా శ్రీమతి బొడ్డు శ్రీలక్ష్మీ సమర్పణలో ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌ దర్శకత్వంలో మురళి సాధనాల కో-ప్రొడ్యూసర్‌గా, వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'మామ ఓ చందమామ'ను మున్నా కాశి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సక్సెస్‌ అయి, సోషల్‌ మీడియాలో పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం డిసెంబర్‌ 8న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో డా. రాజశేఖర్‌, ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవగా సీనియర్‌ హీరో సుమన్‌, జీవిత, రాజ్‌ కందుకూరి, హీరో రామ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ ససనా మక్బూల్‌ఖాన్‌, దర్శకుడు విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌, సంగీత దర్శకుడు మున్నా కాశీ, సీనియర్‌ నటి గీతాంజలి, ప్రముఖ దర్శకుడు శేఖర్‌ సూరి, అయోధ్యకుమార్‌, సంగీత దర్శకుడు శశిప్రీతమ్‌, నాగం తిరుపతిరెడ్డి, చందూలాల్‌, శ్రీనివాస్‌ బొడ్డు తదితరులు హాజరుకాగా, కోప్రొడ్యూసర్‌ మురళి సాధనాల ఫ్లవర్‌ బొకేలతో అతిథుల్ని స్వాగతించారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలైంది. ప్లాటినమ్‌ డిస్క్‌ షీల్డ్‌లను డా. రాజశేఖర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులకు అందించారు. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్‌ 15న రిలీజ్‌ కానుంది.

డా. రాజశేఖర్‌ మాట్లాడుతూ - ''నేను మెడికల్‌ కాలేజ్‌లో వున్నప్పుడు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు సుమన్‌గారికి పెద్ద ఫ్యాన్స్‌ వుండేవారు. బేసిగ్గా ఆయన కరాటే మాస్టర్‌. ఎప్పుడూ ఫిట్‌గా వుంటారు. నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ వుంది. వండ్రఫుల్‌ పర్సన్‌. ఆయన బిజీగా వుండి డేట్స్‌ కుదరకపోవడంతో 'వందేమాతరం' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు టి.కృష్ణగారు. సుమన్‌గారు చేయకపోవడంతో ఆ సినిమాలో నేను నటించాను.

సుమన్‌గారి వల్లే నేను హీరోని అయ్యాను. రామ్‌ కార్తీక్‌ మా పిల్లలకు మంచి ఫ్రెండ్‌. స్టైలిష్‌గా వున్నాడు. మంచి స్మైలింగ్‌ ఫేస్‌. చాలా ప్లెజెంట్‌గా వున్నాడు. ట్రైలర్‌ చూశాక సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్మకం కలిగింది. మున్నా మ్యూజిక్‌ వినసొంపుగా వుంది. డైరెక్టర్‌ వెంకట్‌ చాలా బాగా తీశాడు. సినిమా బాగా వచ్చింది అని సుమన్‌గారు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది.. అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ప్రముఖ రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ - ''హీరో చాలా క్యూట్‌గా వున్నాడు. నిర్మాతలు చాలా కష్టపడి సినిమా చేశారు. కాశీ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఆరు పాటలు చాలా బాగున్నాయి. టీజర్‌, ట్రైలర్‌ చూశాక డైరెక్టర్‌ వెంకట్‌ చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతాడు అన్పించింది. టైటిల్‌ చాలా పాపులర్‌. తప్పకుండా సినిమా 'పెళ్లిచూపులు' కంటే పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

జీవిత మాట్లాడుతూ - ''రామ్‌ కార్తీక్‌ మదర్‌ కోసం ఈ సినిమా మంచి హిట్‌ అవ్వాలి. వారి అబ్బాయి హీరో కావాలని ఆమె చాలా కలలు కన్నారు. ఈ సినిమాతో రామ్‌కార్తీక్‌ సక్సెస్‌ అవుతాడు. ప్రతి సినిమా బాగా ఆడుతుంది. నమ్మకంతో చేస్తాం. సినిమా తీయడం అంత ఈజీకాదు. తీసిన సినిమా సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలి. దానిని మీడియా ఎంతో ప్రమోట్‌ చెయ్యాలి. ప్రేక్షకులు మూవీ చూసి వారి ఒపీనియన్‌ని పదిమందికి తెలియజేయాలి. రివ్యూస్‌ మీద డిపెండ్‌ అవకూడదు. థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలి'' అన్నారు.

నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''ప్రస్తుతం చిన్న సినిమా విజయం వైపు పరుగులు తీస్తోంది. 'క్షణం' నుండి నిన్నటి 'మెంటల్‌ మదిలో' వరకు ఏ సినిమా అయినా కంటెంట్‌ వుంటే కంటిన్యూస్‌గా ఆడుతుంది. టీజర్‌, ట్రైలర్‌ చూస్తుంటే కంటెంట్‌ వున్న సినిమాలా కన్పిస్తుంది. సాంగ్స్‌ అన్నీ ప్రామిసింగ్‌గా వున్నాయి. డైరెక్టర్‌ వెంకట్‌ సినిమాని బాగా తీశాడు. ఈ సినిమా సక్సెస్‌ అయి నిర్మాతలకు మంచి లాభాలు తేవాలి'' అన్నారు.

హీరో సుమన్‌ మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ వెంకట్‌ కథ చెప్పగానే చాలా థ్రిల్‌ అయ్యాను. అమ్మా, చెల్లి, భార్య, కూతురు ఇలా నలుగురు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే క్యారెక్టర్‌ నాది. ఇలాంటి క్యారెక్టర్‌ ఇంతవరకూ చెయ్యలేదు. వెరీ క్లీన్‌ ఫిల్మ్‌ ఇది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. అలాగే చక్కని సందేశం కూడా వుంది. అందర్నీ ఆలోచింపచేసే కథ ఇది. సబ్జెక్ట్‌ వినగానే ఈ సినిమా ఆడుతుంది అని కాన్ఫిడెన్స్‌ వచ్చింది. సినిమా రష్‌ చూశాక నా కాన్ఫిడెన్స్‌ 200% పెరిగింది.

హీరో రామ్‌ కార్తీక్‌ చాలా స్మార్ట్‌గా వున్నాడు. మా కాంబినేషన్‌లో వండ్రఫుల్‌ సీన్స్‌ వున్నాయి. అతని యాక్టింగ్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యాను. ఫెంటాస్టిక్‌గా చేశాడు. హీరోకి కావాల్సిన క్వాలిటీస్‌ అన్నీ కార్తీక్‌లో వున్నాయి. టీమ్‌ అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులు అందరూ చూసేలా వుంటుంది. గరుడవేగతో మంచి హిట్‌ కొట్టిన రాజశేఖర్‌కి కంగ్రాట్స్‌. మధ్య మధ్యలో ఎన్ని అండ్‌ అండ్‌ డౌన్స్‌ వచ్చినా తన విల్‌పవర్‌తో బిగ్‌ హిట్‌ సాధించాడు. కృషి, పట్టుదలతో చేశాడు. ఇంకా మంచి హిట్స్‌ సాధించాలి. డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ని కూడా అభినందిస్తున్నాను'' అన్నారు.

నిర్మాత వరప్రసాద్‌ బొడ్డు బ్రదర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''వరప్రసాద్‌ బొడ్డు యు.ఎస్‌.లో వుండటం వలన ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఫస్ట్‌ నాకు ఫోన్‌ చేసి సినిమా తీస్తున్నాను అని చాలా చెప్పాడు. దానికి నేను 'జాగ్రత్తగా తీయాలి. సినిమా అంటే మామూలు విషయం కాదు. మంచి ఫ్యామిలీ సినిమా తియ్యాలంటే గట్స్‌ వుండాలి' అని మా తమ్ముడికి మురళి సాధనాలగారి సహకారంతో వెంకట్‌ మంచి సినిమా తీశాడు. ఈ సినిమాని ఆదరించి సక్సెస్‌ చెయ్యాలి. నెక్స్‌ట్‌ సినిమా తీయడానికి మాకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను'' అన్నారు.

చిత్ర దర్శకుడు విశాఖ థ్రిల్స్‌ వెంకట్‌ మాట్లాడుతూ - ''రామ్‌గోపాల్‌ వర్మగారిని ఆదర్శంగా తీసుకొని డైరెక్టర్‌ని అవ్వాలని వైజాగ్‌ నుండి ఇండస్ట్రీకి వచ్చాను. గణేష్‌ మాస్టర్‌ వర్గ వద్ద కొరియోగ్రాఫర్‌గా చేశాను. డైరెక్షన్‌లో ఎవరి దగ్గర వర్క్‌ చెయ్యలేదు. కథ చెప్పగానే బాగా నచ్చి సినిమా చేద్దాం అని ముందుకు వచ్చిన మా నిర్మాతలు వరప్రసాద్‌ బొడ్డు, మురళిగారికి నా థాంక్స్‌. మరుధూరి రాజాగారు అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. కెమెరామెన్‌ జి.ఎల్‌.బాబు నాకు అండదండగా నిలిచి ప్రతి ఫ్రేమ్‌ని అందంగా తీర్చిదిద్దాడు. సినిమా బ్యూటిఫుల్‌గా వచ్చింది.

ఈ సినిమాకి 24 క్రాఫ్ట్స్‌వారు నాకు ఎంతో సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహించారు. అందరం టీమ్‌ వర్క్‌గా కలిసి మంచి సినిమా చేశాం. కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రంలో కామెడీ, లవ్‌, సెంటిమెంట్‌, ఎమోషన్‌, థ్రిల్లర్‌ అన్నీ వున్నాయి. హండ్రెడ్‌ పర్సెంట్‌ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంతో వున్నాం. డెఫినెట్‌గా మంచి రిజల్ట్‌ వస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

హీరో రామ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ - ''సుమన్‌, గీతాంజలి వంటి సీనియర్‌ నటులతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా సుమన్‌గారు ఎన్నో సజెషన్స్‌ ఇచ్చారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. ఎంతో ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చారు. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన మా నిర్మాతలు వరప్రసాద్‌, మురళిగారికి నా కృతజ్ఞతలు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రం వుంటుంది. ఇంత మంచి సబ్జెక్ట్‌తో నాతో సినిమా తీసిన డైరెక్టర్‌ వెంకట్‌కి నా థాంక్స్‌. మున్నా కాశీ మ్యూజిక్‌, బాబు కెమెరా విజువల్స్‌ సినిమాకి ఎంతో ప్లస్‌ అవుతాయి'' అన్నారు.

కో-ప్రొడ్యూసర్‌ మురళి సాధనాల మాట్లాడుతూ - ''చిన్న సినిమాని సపోర్ట్‌ చేయడానికి వచ్చిన జీవిత, రాజశేఖర్‌గారికి థాంక్స్‌. అలాగే మా చిత్రంలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మామ ఓ చందమామ' చిత్రం అందరికీ నచ్చేవిధంగా వుంటుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

రామ్‌ కార్తీక్‌, సనా మక్బూల్‌ఖాన్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో సుమన్‌, జీవా, గీతాంజలి, సుర, దువ్వాసి మోహన్‌, కిరీటి, ఖయ్యూం, గెటప్‌ శ్రీను, జబర్దస్త్‌ అప్పారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, ఫొటోగ్రఫీ: జి.ఎల్‌.బాబు, ఎడిటర్‌: మాధవ్‌ కోకా, ఆర్ట్‌: ఉత్తరకుమార్‌, సూరిశెట్టి, సంగీతం: మున్నా కాశీ, సహ నిర్మాత: మురళి సాధనాల, నిర్మాత: వరప్రసాద్‌ బొడ్డు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్స్‌ వెంకట్‌.

More News

అనూప్ రూబెన్స్ @ 50

జై చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశారు అనూప్ రూబెన్స్‌. ఆ త‌రువాత కొన్ని చిత్రాలు చేసినా.. 2011లో వ‌చ్చిన ప్రేమ‌కావాలితో తొలి బ్రేక్‌ని అందుకున్నారు.

నా నమ్మకాన్నినిజం చేసినందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్‌: 'సప్తగిరి ఎల్‌ ఎల్‌.బి' నిర్మాత

కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా కశిష్‌ వోరా హీరోయిన్‌గా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో సాయిసెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై అభిరుచిగల నిర్మాత డా. రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'.

మ‌ణిశ‌ర్మ మ‌ళ్ళీ కాపీ కొట్టాడా?

మెలోడీ పాట‌ల‌కు చిరునామాలా ఉండే సంగీత ద‌ర్శ‌కుల‌లో మ‌ణిశ‌ర్మ ఒక‌రు. అందుకే ఆయ‌న మెలోడీ బ్ర‌హ్మ అనిపించుకున్నారు. అయితే.. ఆ పాట‌ల్లో సొంత బాణీలు ఉన్న‌ట్టే.. కొన్ని కాపీ ట్యూన్స్ కూడా ఉన్నాయి.

డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానున్న అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, 'ఒక్క క్షణం'

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌గా, డిమానిటైజేష‌ల్ లో కూడా బ్లాక్‌బ‌స్టర్ గా నిలిచిన‌ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో.... సినిమా నిర్మించడంలో ఎక్క‌డా ఎలాంటి కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ క

ఫిబ్రవరి 9న విడుదలవుతున్న నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా "కిరిక్ పార్టీ"ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిర్రాక్ పార్టీ'గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.