తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం రూ.2 లక్షలు

  • IndiaGlitz, [Wednesday,April 22 2020]

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 22). ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను ఆమె విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ మరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఈ రోజు ఉదయం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్ అని అన్నారు.

More News

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన చరణ్‌దీప్

'బాహుబలి'లో కాలకేయ తమ్ముడిగా, వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలో విలన్‌గా, 'సైరా నరసింహారెడ్డి', 'పీఎస్వీ గరుడవేగ', 'కల్కి' చిత్రాల్లో కీలక పాత్రల్లో

తెలంగాణ: వెయ్యికి చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకూ నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తున్న రాష్ట్ర ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు.

మే-03 తర్వాత మోదీ, కేసీఆర్ వ్యూహం ఇదేనా!?

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఇప్పటికే కొన్ని సడలింపులు

కరోనా నేపథ్యంలో వాలంటీర్లకు వైఎస్ జగన్ స్పెషల్ గిఫ్ట్

యావత్ ఇండియా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఈ వ్యవస్థపై ప్రతిపక్షాలు తిట్టిపోసినా

సూర్యాపేట జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే అనుకుంటే ఇప్పుడు జిల్లాలకూ పెద్ద ఎత్తున వ్యాపించింది. మరీ ముఖ్యంగా