రాజ‌శేఖ‌ర్ అల‌క‌...

  • IndiaGlitz, [Friday,March 22 2019]

మా ఎన్నిక‌ల్లో న‌రేష్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంగ్ పోటీ చేసిన డా.రాజ‌శేఖ‌ర్ స‌హా నరేష్ ప్యానెల్ .. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కొత్త పాల‌క వ‌ర్గం నేడు ప్ర‌మాణ స్వీకారం చేసింది. ఎన్నిక‌ల ముందు.. ఫ‌లితాల త‌ర్వాత క‌లిసి ఉన్న న‌రేష్‌, జీవిత, రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య చిన్న పాటి అల‌క‌లు చోటు చేసుకున్నాయి. విష‌య‌మేమంటే.. న‌రేష్ ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత మాట్లాడుతూ నేను 'మా' ఉన్న‌తికి పాటు ప‌డుతానంటూ మాట్లాడుకుంటూ వ‌చ్చాడు.

అయితే.. న‌రేష్ అలా మాటిమాటికీ నేను అని సంబోధించుకుంటూ మాట్లాడ‌టాన్ని హీరో రాజ‌శేఖ‌ర్ జీర్ణించుకోలేపోయాడు. ముందు మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని రాజ‌శేఖ‌ర్‌.. త‌ర్వాత జీవిత మాట్లాడుతుంటే మైక్ లాక్కుని.. న‌రేష్ నేను అని అన‌కుండా మేము అని మాట్లాడాల్సింది అంటూ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. న‌రేష్‌, జీవిత ఈ వ్య‌వ‌హారాన్ని మొత్తానికి మెత్త‌గా స‌ర్దారు. 

More News

'మా' ప్రమాణోత్సవంలో హేమను అవమానించిన నరేశ్!

‘మా’  (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీనియర్ నటి హేమ సత్తా ఏంటో చాటిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం రోజే కోటను అవమానించిన నరేశ్!

‘మా’ (మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కమిటీ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారోత్సవం అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఏం విజయసాయి.. మీ అనుమతి తీసుకోవాలా..!?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన నుంచి మ‌రో జాబితా విడుదల

జనసేన పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులతో మ‌రో జాబితాను విడుదల చేశారు. జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

పవన్ కల్యాణ్‌పై రోజా సంచలన కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా సంచలన కామెంట్స్ చేశారు. రోజా చేసిన ఈ హాట్ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యాయి.