ట్విట్టర్ లో రాజశేఖర్ ఎంట్రీ..కెసిఆర్ నిర్ణయానికి మద్దతు..!

  • IndiaGlitz, [Monday,December 19 2016]

యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఫ‌స్ట్ ట్వీట్ అంటూ తెలంగాణ రాష్ట్ర సి.ఎం కెసిఆర్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తూ ట్వీట్ చేసారు. ఇంత‌కీ కెసిఆర్ ఏమన్నారంటే...నిజాయితీప‌రులు, న‌ల్ల‌ధ‌నం పోవాల‌ని కోరుకునే వారు, ప్ర‌పంచాన్ని శాసించే స్ధాయికి దేశం ఎద‌గాల‌ని కోరుకునేవారు పెద్ద నోట్ల పై మోడీ తీసుకున్న నిర్ణ‌యం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంది అంటే ఎందుకు వ్య‌తిరేకించాలి..? చిన్న చిన్న లోపాలు ప‌ట్టించుకోకుండా అంద‌రం మ‌ద్ద‌తిద్దాం.
ముస్లిం సోద‌రులు కూడా ఆయ‌న‌కు ఈ విష‌యంలో మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా నాకు తెలిసింది. కాబ‌ట్టి మ‌నం కూడా మ‌న ప్ర‌య‌త్నంగా మ‌ద్ద‌తిద్దాం. ప్ర‌ధాన మంత్రి విజ‌య‌వంత‌మ‌వుతారో లేదో చూద్దాం. మంచి జ‌రిగితే అంద‌రం ఆహ్వానిద్దాం. చెడు జ‌రిగితే అంద‌రం స‌మిష్టిగా పోరాడ‌దాం అని కెసిఆర్ అన్నారు. ఈ విష‌యం పై హీరో రాజ‌శేఖ‌ర్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...మోడీ విజ‌న్ ను కెసిఆర్ క‌రెక్ట్ గా అర్ధం చేసుకున్నారు అంటూ కెసిఆర్ శాస‌న స‌భ‌లో మాట్లాడిన అంశాల‌తో ఈరోజు దిన‌పత్రిక‌ల్లో ప్ర‌చురించిన ఆ వార్త‌ను పోస్ట్ చేసారు.

More News

అప్పుడు త్రిష..ఇప్పుడు కాజోల్....మధ్యలో ధనుష్

ధనుష్ హీరోగా రూపొంది ఘన విజయం సాధించిన వేల ఇల్లాద పట్టదారి సినిమాను తెలుగులో రఘవరన్ బి.టెక్ పేరుతో విడుదల చేస్తే తెలుగులో కూడా రఘవరన్ బి.టెక్ పెద్ద హిట్ అయ్యింది.

అంచనాలను పెంచేస్తున్న శతమానంభవతి పాటలు..!

ఉత్తమాభిరుచి గల నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్నమరో కుటుంబ కథా చిత్రం శతమానంభవతి.

రాంగ్ రూటులో రేష్మి..!

జబర్ధస్ట్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన హాట్ యాంకర్ రేష్మి.

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం150 టీజర్ ను ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

'శతమానం భవతి' పాటల పల్లకి వచ్చేసింది....

`శర్వానంద్,అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై