'కల్కి' సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Tuesday,June 25 2019]

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడో ఎంక్వయిరీ మొదలుపెట్టారు... 'కల్కి' విడుదల ఎప్పుడు? అని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంతలా ఆసక్తి కలిగించాయి. రాజశేఖర్ కథానాయకుడిగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి'. శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ టాకీస్' వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను 'యు/ఎ) సర్టిఫికెట్ లభించింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. కొన్ని గంటల క్రితం విడుదలైన హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో 'హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే' డైలాగ్‌ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. వీటన్నిటి కంటే ముఖ్యంగా రాజశేఖర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. 'కల్కి' పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ హైలైట్ అయ్యాయి. 'గరుడవేగ' తర్వాత 'కల్కి'తో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

More News

ఏపీ సీఎం అభ్యర్థిగా మెగాస్టార్ చిరు.. బంపరాఫర్!?

మెగాస్టార్ చిరంజీవీ మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా..? బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..?

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జగన్ కీలక నిర్ణయాలు

ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం, హోదా ఉద్యమ కారులపై కేసుల

చైన్నైకు అండ‌గా నిల‌వండి అంటున్న మంచు మ‌నోజ్‌

చెన్నై మహానగరంలో నీటి ఎద్దడి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. ప్ర‌జ‌లు క‌నీస అవ‌స‌రాల నీటి కోసం నానా ఇక్క‌ట్లు ప‌డుతున్నారు.

ల‌య‌న్ కింగ్ లో స్కార్ పాత్ర కి డ‌బ్బింగ్ చెప్పిన జ‌గ‌ప‌తిబాబు, ముఫార్ పాత్ర‌కి పి.ర‌విశంక‌ర్

అడ‌విలో జంతువులు మాట్లాడి స్నేహం చేస్తే చూడ‌టానికి చాలా ఆనందంగా వుంటుంది. పిల్ల‌లైతే అవి చూస్తూ మ‌రో లోకం లో తేలిపోతారు.

ఆకట్టుకుంటున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ఫస్ట్‌ సాంగ్‌

'ముద్దాబంతి పూవు ఇలా పైట వేసెనా.. ముద్దూ ముద్దూ చూపులతో గుండె కోసెనా...' అంటూ యాజిన్‌ నిజార్‌ పాడిన 'కౌసల్య కృష్ణమూర్తి..