రాజ‌శేఖ‌ర్  'క‌ల్కి' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,January 01 2019]

డా.రాజ‌శేఖ‌ర్ న‌టించిన 'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. 'అ' వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'క‌ల్కి'.

శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగాన‌టిస్తున్నారు.

అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నూత‌న సంవత్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

More News

జనవరి 2న 'మిస్టర్ మజ్ను' టీజర్

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ మజ్ను'.

మోడీ పాత్ర‌లో చెర్రీ విల‌న్‌...

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తుంది. ప్ర‌ముఖ సినీ, రాజ‌కీయ‌, క్రీడా కారుల జీవితాల‌ను బ‌యోపిక్స్‌గా తెర‌కెక్కిస్తున్నారు.

లెస్బియ‌న్ పాత్ర‌లో రెజీనా...

తెలుగు, త‌మిళ చిత్రాల్లో బిజీ బిజీగా ఉన్న రెజీనా ఇప్పుడు బాలీవుడ్‌లో 'ఏక్ ల‌డ్‌కీ కో దేఖాతో ఐసా ల‌గా' సినిమాలో న‌టిస్తుంది. సోన‌మ్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తోంది.

25న అక్క‌డ రాంచ‌ర‌ణ్ సినిమా రిలీజ్‌

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఇత‌ర ద‌క్షిణాది చిత్రాల మార్కెట్‌పై క‌న్నేసిన తెలుగు హీరోలు అక్క‌డ కూడా తమ సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, బ‌న్ని, రాంచ‌ర‌ణ్ అంద‌రూ ఇదే రూట్‌

సూర్య టైటిల్ ఫిక్స్ అయ్యింది...

'మీట్‌ప్పాన్‌', 'కాప్పాన్‌', 'యురిక్కా' అనే మూడు టైటిల్స్‌లో ఏ టైటిల్ పెడితే బావుంటుందో మీరే చెప్ప‌డంటూ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ ప్రేక్ష‌కుల‌కే చాయిస్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.