రాజశేఖర్ మూవీ ఫస్ట్ లుక్ డేట్...

  • IndiaGlitz, [Wednesday,February 01 2017]

పోలీస్‌, సి.బి.ఐ పాత్ర‌ల‌కు హీరో డా.రాజ‌శేఖ‌ర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు స‌హా ప‌లు పోలీసు క్యారెక్ట‌ర్స్‌లో రాజ‌శేఖ‌ర్ మెప్పించారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రాజ‌శేఖ‌ర్ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గానే క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకు 'గ‌రుడ వేగ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఓ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్ జీవితంలో అనుకోకుండా స‌మ‌స్య‌లు ఎదురైతే వాటి నుండి త‌నెలా భ‌య‌ప‌డ్డాడు, ప్ర‌జ‌ల‌నే ర‌క్షించాడ‌నేదే క‌థాంశమ‌ట‌. ఈ సినిమాలో పూజాకుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

తెలంగాణ చేనేత అంబాసిడర్ గా సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు చేనేత వస్త్రాలకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక అంబాసిడర్ గా నియమితురాలైంది.

శ్రేష్ట మూవీస్ ఆఫీస్ పై ఐటీ దాడులు..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

100వ సినిమా విషయంలో ఫ్యాన్స్ లెక్క వేరు... నా లెక్క వేరు - నాగార్జున

వెంకటేశ్వర స్వామి భక్తుడు హధీరామ్ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఓం నమో వేంకటేశాయ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నవరస సమ్రాట్ అక్కినేని నాగార్జునతో ఇంటర్ వ్యూ మీకోసం...!

ఫిబ్రవరి 10 న 'ఓం నమో వేంకటేశాయ'

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకంపై

గౌతమి పుత్ర శాతకర్ణికి సుబ్బిరామిరెడ్డి సన్మానం!

ప్రముఖ నిర్మాత,రాజకీయవేత్త సుబ్బిరామిరెడ్డి నిన్న సాయంత్రం శతచిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణను'గౌతమిపుత్ర శాతకర్ణి'