న‌వంబ‌ర్ 3న 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'

  • IndiaGlitz, [Saturday,October 07 2017]

తెలుగు చ‌ల‌న చిత్రాల్లో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్ఐఎ) పై ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు రాలేదు. ఓ సిన్సియ‌ర్ ఎన్ఐఎ ఆఫీస‌ర్ దేశం కోసం, త‌న కుటుంబం కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ' పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా సినిమా రూపొందుతోంది. మంచి క‌థ‌, ప‌వ‌ర్‌పుల్ హీరోయిజం, హృద‌యాన్ని తాకే ఎమోష‌న్స్‌, ఉత్కంఠ‌త రేపే స‌న్నివేశాలతో సినిమాను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించారు. మ‌గాడు అంత ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో రాజ‌శేఖ‌ర్‌ను ప్రెజంట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ప‌డ్డ త‌ప‌న తెర‌పై సినిమా రూపంలో క‌న‌ప‌డుతుంది.

జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో కోటేశ్వ‌ర్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ - "మా బేన‌ర్‌లో వ‌స్తోన్న తొలి సినిమా 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'. సినిమా ప్రారంభం నుండి ప్ర‌తి పాత్ర‌ను రివీల్ చేస్తూ, దేనిక‌దే ప్ర‌త్యేకం అనేలా అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగించేలా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తూ వ‌చ్చాం. హీరోయిన్ పూజా కుమార్ ఇందులో గృహిణి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అదిత్ అరుణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ్ర‌ద్ధాదాస్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. కిషోర్ మెయిన్ విల‌న్‌గా న‌టించారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌వివ‌ర్మ‌, నాజ‌ర్‌, పృథ్వీ, షాయాజీ షిండే త‌దిత‌రులు సినిమాలో న‌టించారు. ఇలా భారీ తారాగ‌ణం, సాంకేతిక నిపుణులతో మేకింగ్‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా సినిమాను హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందించాం. ప్రెస్జీజియ‌స్‌గా నిర్మించిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

అమెరికాలో బ్ర‌హ్మానందంని ఘ‌నంగా స‌న్మానించిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్..!

అమెరికా లోని సియాటెల్ నగరం లో తస్వీర్ 12 వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిధిగా ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించుకున్న డాక్టర్ బ్రహ్మానందం హాజ‌ర‌య్యారు. ఇదే వేదిక పై అక్టోబర్ 7 న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందం ని ఘనంగా సన్మానించింది.

సింగిల్ విండో అనుమ‌తులు..ఆన్ లైన్ టిక్కెట్ పోర్ట‌ల్ ను ప్రారంభించిన మంత్రి త‌ల‌సాని

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ భ‌విత‌వ్యంపై సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు టి-ప్ర‌భుత్వంతో ముచ్చ‌టించిన సంగతి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు కొన్ని హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా సింగిల్ విండో ప‌ద్ధ‌తిలో షూటింగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సునాయాసంగా అనుమ‌తులు ల‌భింĵ

షకీలా చేతుల మీదుగా 'ద్యావుడా' ఆడియో విడుదల

శాన్వి క్రియేషన్స్ సమర్పించు అమృత సాయి ఆర్ట్స్ ఫిల్మ్ 'ద్యావుడా'. సాయిరామ్ దాసరి దర్శకత్వంలో భాను, శరత్, కారుణ్య, హరిణి, అనూష, జై  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత హరీష్ కుమార్ గజ్జల.

'అందమైన జీవితం' అక్టోబర్ 13 న విడుదల

మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై, మలయాళం లో సంచలన విజయం సాధించిన 'జొమోంటే సువిశేషంగాళ్' చిత్రాన్ని 'అందమైన జీవితం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు అభిరుచి గల నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. సత్యన్ అంతిక్కాడ్ ఈ చిత్రానికి దర్శకుడు.  దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాని

అత‌ని పై నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ..

ఎవ‌రి మీద‌నో కాదండి..హీరో జై పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వివ‌రాల్లోకెళ్తే..గ‌త నెల సెప్టెంబ‌ర్ 21న త‌ప్ప‌తాగిన జై మ‌ద్యం మ‌త్తులో ఆడయార్‌లో ఓ బ్రిడ్జ్‌ను త‌న కారుతో ఢీ కొట్టాడు. ట్రాఫిక్ పోలీసులు జై పై కేసు పెట్టారు.