యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'శేఖర్' ఫస్ట్ సింగిల్ "లవ్ గంటే మోగిందంట" విడుదల

  • IndiaGlitz, [Thursday,January 06 2022]

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 5న) ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్ కి చంద్రబోస్ గారి సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు.
లవ్ గంటే మోగిందంట అంటూ సాగే ఈ పాట యొక్క లిరికల్ వీడియోలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. మల్లికార్జున్ నరగని కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్స్ ఇస్తున్నాయి.

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సింగల్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్.

More News

నా నటన. అతిధి దేవోభవ లో అందరినీ మెప్పిస్తుంది.. ఆది

ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన అతిథి దేవోభవ' జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు.

ఏపీలో టికెట్ రేట్ల వివాదం: నాకేం ఇబ్బంది లేదు.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న ఏపీ టికెట్ల ఇష్యూపై టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రేట్లతో మీకు

NBK 108: సంపత్ నంది దర్శకత్వంలో బాలయ్య.. మాస్ మెచ్చే ఫార్ములాతో స్క్రిప్ట్ రెడీ...?

సినిమాల విషయంలో కుర్ర హీరోల కంటే స్పీడ్‌గా వెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి..

ప్రభాస్ ఫ్యాన్స్‌కి చేదువార్త , సంక్రాంతి రేస్ నుంచి ‘‘రాధేశ్యామ్’’ ఔట్.. అఫిషీయల్‌ అనౌన్స్‌మెంట్

ఊహాగానాలే నిజమయ్యాయి.. సంక్రాంతి బరిలో నుంచి మరో పెద్ద సినిమా తప్పుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘‘రాధేశ్యామ్’’ విడుదల వాయిదా పడింది.

పుష్ప సినిమాను వీక్షించిన మహేశ్.. నీ నటన స్టన్నింగ్ అంటూ బన్నీకి కాంప్లిమెంట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘పుష్ప’’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది.