close
Choose your channels

వావ్.. ఇద్దరు యంగ్ బ్యూటీస్ తో రాజశేఖర్ రొమాన్స్

Tuesday, June 8, 2021 • తెలుగు Comments

వావ్.. ఇద్దరు యంగ్ బ్యూటీస్ తో రాజశేఖర్ రొమాన్స్

ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ హీరో రాజశేఖర్ తనదైన శైలిలో విజయాలతో దూసుకుపోయారు. ఆ తర్వాత కొంత కాలం పాటు రాజశేఖర్ కెరీర్ నెమ్మదించింది. ఆయన నంటించిన చిత్రాలు నిరాశపరిచాయి. ఇక 2017లో విడుదలైన గరుడవేగ చిత్రంతో రాజశేఖర్ బౌన్స్ బ్యాక్ అయ్యారనే చెప్పాలి.

ఇదీ చదవండి: 'వకీల్ సాబ్' బ్యూటీ బ్లాస్టింగ్ సెక్సీ లుక్స్

ప్రస్తుతం రాజశేఖర్ సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ తీసుకుని తనకు సెట్ అయ్యే కథలనే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న చిత్రం 'శేఖర్'. లలిత్ దర్శకుడు.

ఎమ్ ఎల్ వి సత్యనారాయణతో పాటు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ లో రాజశేఖర్ తెల్ల జుట్టు, గడ్డంతో కనిపిస్తుండడం ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రం కోసం మూవీ టీం ఇద్దరు హీరోయిన్లని ఎంపిక చేయడం విశేషం.

మలయాళీ హీరోయిన్ అను సితార, నార్త్ బ్యూటీ ముస్కన్ ఖుబ్ చాందిని హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ముస్కన్ ఇప్పటికే తెలుగులో జార్జ్ రెడ్డిలో నటించింది. అను సీతారకు ఇదే తొలి చిత్రం. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz