జగపతిని ఫాలో అవుతున్న యాంగ్రీయంగ్ మెన్..

  • IndiaGlitz, [Friday,December 11 2015]

జ‌గ‌ప‌తి బాబును ఫాలో అవుతున్నాడు యాంగ్రీయంగ్ మెన్ డా.రాజ‌శేఖ‌ర్. యాంగ్రీ యంగ్ మెన్ ఒక‌ప్పుడు..ఇప్పుడు కాదులేండి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...జ‌గ‌ప‌తిబాబు ఈమ‌ధ్య హీరోగా న‌టించినా..ప్రేక్ష‌కుల నుంచి ఆశించిన స్ధాయిలో స్పంద‌న మాత్రం రాలేదు. ఇక లాభం లేద‌నుకుని జ‌గ‌ప‌తి రూటు మార్చి క‌థానాయ‌కుడు కాస్త ప్ర‌తి నాయ‌కుడుగా మారాడు. లెజెండ్ సినిమాలో బాల‌య్య‌ని ఢీ కొట్టే విల‌న్ గా న‌టించి మెప్పించాడు. ఇప్పుడు డా.రాజ‌శేఖ‌ర్ కూడా జ‌గ‌ప‌తి రూటులోనే వెళ్ళాల‌నుకుంటున్నాడ‌ట‌.

టీవ‌ల ఓ డైరెక్ట‌ర్ రాయ‌ల‌సీమ నేప‌ధ్యంలో సాగే సినిమాలో విల‌న్ గా న‌టించ‌మ‌ని రాజ‌శేఖ‌ర్ ని అడిగాడ‌ట‌. క‌థ విని రాజ‌శేఖ‌ర్ ఓకె చెప్పిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే రాజ‌శేఖ‌ర్ విల‌న్ గా న‌టించే సినిమా వివ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ట‌.

మ‌రి...జ‌గ‌ప‌తి వ‌లే రాజ‌శేఖ‌ర్ కూడా ప్ర‌తి నాయ‌కుడుగా ఆక‌ట్టుకుని బిజీ అవుతాడ‌ని ఆశిద్దాం.

More News

యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...ఓ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? గోపీచంద్ తో జిల్ సినిమాని తెరకెక్కించిన రాధాక్రిష్ణ కుమార్.

చిరు సినిమా కోసం ప్రయత్నిస్తున్న డైరెక్టర్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ...క్లారిటి మాత్రం రావడం లేదు. చిరు 150వ సినిమా ప్రకటన దసరాకి రావడం ఖాయం అన్నారు. కానీ రాలేదు....

నాగ్, పూరి మధ్యలో కళ్యాణ్..

కింగ్ నాగార్జున.. అఖిల్ రెండో సినిమా బాధ్యతను ఏ డైరెక్టర్ కి అప్పచెప్పాలనే విషయం పై చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ లో కొంత మంది బిజీగా ఉన్నారు. మరి కొంత మంది ఖాళీగా ఉన్నా...సక్సెస్ లో లేక వాళ్ళతో చేయడం ఇష్టం లేదు.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్...

తమిళంలో శశికుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘సుందర పాండ్యన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

'హితుడు' మూవీ రివ్యూ

నాయకుడి నుండి ప్రతి నాయకుడి పాత్రకు మారిన జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హితుడు.