close
Choose your channels

'రాజ రాజ చోర‌' .. ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

Wednesday, August 11, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజ రాజ చోర‌`. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఎంట‌ర్‌టైనింగ్ టీజ‌ర్‌, పాట‌లు స‌హా ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఈ సినిమాను ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేస్తున్నట్లు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ హాయిగా న‌వ్వుకోవాల‌ని, మంచి సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నారు. `రాజ రాజ చోర‌` ఈ అప‌రిమిత‌మైన వినోదాన్ని అందించ‌డం ఖాయం అని అంద‌రూ భావిస్తున్నారు.

`రాజ‌రాజ చోర‌` చిత్రంలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా హిలేరియ‌స్ పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. మేఘా ఆకాశ్ మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా సునైన క‌నిపించ‌నుంది. హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వేద రామ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందించారు.

న‌టీన‌టులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్‌, సునైన‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గంగ‌వ్వ‌, అజ‌య్ ఘోష్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.