తన పెన్ పవర్తో గోనగన్నారెడ్డిని పాత్రను మలచిన రాజసింహ

  • IndiaGlitz, [Friday,October 09 2015]

ఇండియ‌న్ తొలి హిస్టారిక‌ల్ ఇండియ‌న్ 3డి మూవీగా రూపొందిన చిత్రం రుద్ర‌మదేవి. అనుష్క టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో రానా చాళుక్య వీర‌భ‌ద్రుడు పాత్ర‌లో న‌టించగా, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గో్న‌గ‌న్నారెడ్డి పాత్ర‌లో న‌టించాడు. రుద్ర‌మ‌దేవి కాలంలో ఆమెకు గోన‌గ‌న్నారెడ్డి ఎలాగైతే అండ‌దండ‌లుగా నిలిచాడో ఈ సినిమా విషయంలో మ‌న గోనగ‌న్నారెడ్డి బ‌న్ని రుద్ర‌మ‌దేవి సినిమా విష‌యంలో అండదండ‌లందించాడు. సినిమాలో కూడా గోన‌గ‌న్నారెడ్డి పాత్ర చాలా హైలైట్‌గా నిలిచింది. బ‌న్ని ఇంట‌డ‌క్ష‌న్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు బ‌న్ని లుక్‌, డైలాగ్ డెలివ‌రీ చాలా బావుంది. త‌న డైలాగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఈ సినిమాలో బ‌న్ని గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌లో న‌టించ‌డానికి నిర్ణ‌యించుకున్న‌ప్పుడే పాత్ర‌ను చ‌క్క‌గా మ‌సలుకోవ‌డానికి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. సాధార‌ణంగా బందిపోటు దొంగ అయిన గోన‌గ‌న్నారెడ్డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పాల‌మూరు ప్రాంతానికి చెందిన‌వాడు. అందువ‌ల్ల బ‌న్ని త‌న పాత్ర చాలా బాగుండాల‌ని డైలాగ్స్ అన్నీ పాలమూరు రూర‌ల్ తెలంగాణ యాస‌లోనే డైలాగ్స్‌ను రాయించుకున్నారు. అందుకోసం ప్ర‌త్యేకంగా రాజ‌సింహా అనే ర‌చ‌యిత‌ను నియిమించుకున్నాడ‌ట‌. త‌ను పాల‌మూరు రూర‌ల్ తెలంగాణ‌పై రీసెర్చ్ చేసి డైలాగ్స్‌ను అందంగా రాశాడు. గ‌మ్ముగుండ‌వో..., నా మొల‌తాడులో తాయెత్తు...వంటి డైలాగ్స్‌ను సంద‌ర్భానుసారం రాయించి ప‌లికించిన తీరు ఆక‌ట్టుకుంది.మొత్తం మీద రాజ‌సింహ ర‌చ‌యిత‌గా త‌న పెన్ ప‌వ‌ర్‌ను చూపించాడన‌డంలో సందేహం లేదు. రచ‌యిత‌గా ఉన్న రాజ‌సింహ ఇప్పుడు ఒక్క అమ్మాయి త‌ప్ప అనే సినిమాతో ద‌ర్శ‌కుడుగా మారుతున్నాడు. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్స్‌లో ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

More News

షకీలాగా షేక్ చేయనున్న సమంత

క్యూట్ గర్ల్ సమంత.. షకీలాగా సందడి చేయబోతోంది. 'నీ పేరేంట 'ని అడగడం ఆలస్యం.. 'షకీలా' అంటూ హై ఎనర్జీ లెవల్స్ తో చెప్పుకొచ్చే పాత్రలో సమంత వెండితెర పై కనిపించనుంది.

తనయులు ప్లస్ స్టార్ హీరోలు

దసరా పండక్కి రెండు భారీ చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో రానుండడమే తెలుగు ప్రేక్షకులకి మహదానందమైతే.. ఇద్దరు అగ్ర నాయకులు చెరో సినిమాలో తళుక్కున మెరవడం మరింత ఎంటర్ టైన్ మెంట్ పెంచినట్లవుతోంది.

'ఊపిరి'లో ఎవరి పాత్రలు ఏమిటంటే..

'బృందావనం', 'ఎవడు' చిత్రాల విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కిస్తున్నారు. తెలుగులో 'ఊపిరి'గా, తమిళంలో 'తోళా' గా ఈ సినిమా రూపొందుతోంది.

బన్ని , బోయపాటిల ప్రయత్నం ఫలించేనా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రంలో బన్ని సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

బాలకృష్ణ చేతులమీదుగా 'సతీ తిమ్మమాంబ' ఆడియో విడుదల

శ్రీ వెంకట్,భవ్య శ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం సతీ తిమ్మమాంబ.