'రాజ్‌దూత్' టీజ‌ర్‌కి అద్భుత స్పంద‌న‌!

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్‌ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'రాజ్ దూత్'. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ మిలియ‌న్ వ్యూస్ అధిగ‌మించి యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.

ఈ టీజ‌ర్ కి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా కామ‌న్ జ‌నాల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది. రియ‌ల్ స్టార్ వార‌సుడిగా మేఘాంశ్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మేఘాంశ్ హీరోయిక్ లుక్ అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తోంది. హీరోయిజానికి స‌రిప‌డే ఛామింగ్ & డ్యాషింగ్ లుక్ అత‌డికి ఉంది. అత‌డిలో రియ‌ల్ స్పార్క్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. యూట్యూబ్.. సామాజిక మాధ్య‌మాల చాటింగ్ లో ప‌లువురు మేఘాంశ్ లుక్ .. అప్పియ‌రెన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

మొత్తానికి టీజ‌ర్ తోనే ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న ఈ యంగ్ హీరోకి తండ్రి శ్రీ‌హ‌రి ఆశీస్సుల‌తో పాటు తెలుగు సినీప్రేక్ష‌కుల ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని మేఘాంశ్ మాతృమూర్తి శ్రీ‌మ‌తి శాంతి శ్రీ‌హ‌రి ఆకాంక్షించారు. రియ‌ల్ స్టార్ కి మీడియా ఒక కుటుంబ స‌భ్యులుగా అండ‌గా నిలిచారు. అదే తీరుగా ఆయ‌న వార‌సుడు మేఘాంశ్ కి మీడియా అండ‌దండ‌లు ల‌భిస్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. రాజ్ దూత్ త‌ర్వాత మేఘాంశ్ శ్రీ‌హ‌రితో వెంట‌నే సినిమాని నిర్మిస్తున్నామ‌ని ఇప్ప‌టికే నిర్మాత ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. అలానే మేఘాంశ్ - శివాత్మిక జంట‌తో సినిమా తీసే ఆలోచ‌న ఉంద‌ని టీజ‌ర్ లాంచ్ ఈవెంట్లో జీవిత రాజ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

More News

తొలి కేబినెట్ భేటీతోనే జగన్ రికార్డ్.. 43 అంశాలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌‌తో రికార్డ్ సృష్టించారు.

'కెప్టెన్ రాణా ప్రతాప్‌' ఆడియో విడుదల

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌.

జూన్ 13న "సాహో" ట్రైలర్ విడుదల

'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో.

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ గుడ్ బై...

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం నాడు గుడ్ బై చెప్పేశారు. కాగా.. యువీ రిటైర్మెంట్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తొలి కేబినెట్‌లోనే సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.