అదుగో చిత్రానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ వాయిస్ ఓవ‌ర్..

  • IndiaGlitz, [Saturday,October 27 2018]

అదుగో.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఇప్పుడు న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా అదుగో టీంతో జ‌త క‌లిసారు. ఈ చిత్రానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. దివాళి సంద‌ర్భంగా అదుగో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. పూర్తి ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది.

ఈ పాత్ర‌కే రాజేంద్ర‌ప్ర‌సాద్ డ‌బ్బింగ్ చెప్పారు. ఈయ‌న వాయిస్ ఓవ‌ర్ అదుగో చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌కు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటుంది చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే విడుద‌లైన అదుగో ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. బంటిగా పందిపిల్ల అంద‌రి మ‌న‌సుల‌ను దోచేసింది. వినోదాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు.

పందిపిల్ల నిజంగా ఉండేలా క‌నిపించడానికి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ టెక్నాల‌జీని వాడుకున్నారు. ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాల‌జీ వాడుకోవ‌డం ఇదే తొలిసారి. అభిషేక్ వ‌ర్మ‌, న‌భాన‌టాష్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థ‌పై ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

More News

తమ్మారెడ్డి భరద్వాజ్ చేతులమీదుగా 'దమయంతి' మూవీ టీజర్ విడుదల

గురు దత్త క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అంగారిక వియాన్ జీ నిర్మిస్తున్న చిత్రం 'దమయంతి'. నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో

విజ‌య్ 'స‌ర్కార్‌' కి క‌ష్టాలు...

విజ‌య్‌, ముర‌గ‌దాస్ సినిమా 'సర్కార్' దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంది.

గోపీచంద్ బ‌యోపిక్ కూడా అదే పార్ములాలోనే..

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌కు రంగం సిద్ధ‌మ‌వుతుంది.

'అనగనగా ఓ ప్రేమకథ' ట్రైలర్ ను విడుదల చేసిన 'గోపీచంద్'

'అనగనగా ఓ ప్రేమకథ ' ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు ఉదయం  ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా 'ట్విట్టర్' ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్‌..

ఎంద‌రో డెబ్యూ హీరోయిన్స్ టాలీవుడ్‌లోకి హీరోయిన్స్‌గా అడుగుపెట్టి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. అటువంటి వారిలో ప్రాచి తేల‌న్ ఒక‌రు.