ర‌జ‌నీ - శంక‌ర్ ల 2.0 ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తుంది..!

  • IndiaGlitz, [Wednesday,August 17 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం 2.0. రోబో చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 2.0 చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా..బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.

దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇదిలా ఉంటే...ఈరోజు డైరెక్ట‌ర్ శంక‌ర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హ‌లింగ‌మ్ ర‌జ‌నీ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంత‌కీ...రాజు మ‌హ‌లింగ‌మ్ చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటంటే..న‌వంబ‌ర్ లో 2.0 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. 2010లో రోబోతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ర‌జ‌నీ - శంక‌ర్ కాంబినేష‌న్ ఈసారి ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

ఆది కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ చుట్టాల‌బ్బాయి - ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్

'అహనాపెళ్లంట', 'పూలరంగడు' వంటి హిట్‌ చిత్రాలను అందించి కింగ్‌ నాగార్జునతో 'భాయ్‌'వంటి యాక్షన్‌ చిత్రాన్ని రూపొందించిన వీరభద్రమ్‌ కొంత విరామం తర్వాత 'చుట్టాలబ్బాయి'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

యువ హీరో చేతుల మీదుగా ఎం.ఎస్ థోనీ ట్రైలర్ రిలీజ్..!

సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ప్రధాన పాత్రలో నీరజ్ పాండే తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ఎం.ఎస్.ధోనీ

అందుకే...వక్కంతం వంశీతో సినిమా ఎన్టీఆర్ కి ప్రత్యేకం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం జనతా గ్యారేజ్.

ప్రేమ‌మ్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..!

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్నిపి.డి.వి ప్రసాద్ సమర్పణలో సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్..!

ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నసంచ‌ల‌న‌ చిత్రం బాహుబ‌లి 2. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు.