Download App

ర‌జ‌నీకాంత్ 165వ సినిమా టైటిల్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ డ్యూయెల్ షేడ్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ప‌గ‌టి వేళ‌లో ఓ హాస్ట‌ల్‌కి వార్డెన్‌గా ఉండే ర‌జ‌నీకాంత్ రాత్రి కాగానే మాఫియా డాన్‌గా మారుతాడ‌ట‌.

మ‌రి ఇంత సంఘ‌ర్ష‌ణ ఉండే క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా టైటిల్‌ను నేడు చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. పేట్ట అనే టైటిల్‌ను నిర్ణయించ‌డంతో పాటు.. ర‌జ‌నీకాంత్ ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేశారు.  రజనీకాంత్‌తో పాటు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, సనంత్, సిమ్రన్, త్రిషా, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.