సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168 రిలీజ్ డేట్‌!!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. తెలుగులో ద‌రువు, శంఖం, శౌర్యం చిత్రాల‌తో పాటు త‌మిళంలో వివేగం, విశ్వాసం, వీరం, వేదాళం చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ, కీర్తిసురేశ్‌, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌నను కూడా వెలువ‌రించారు.

గ‌త ఏడాది సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న ఎ.ఆర్‌.మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ద‌ర్బార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మ‌రోసారి కూడా ర‌జినీకాంత్ సంక్రాంతి బ‌రిలోకే దిగుతున్నారు. డి.ఇమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. వెట్రి ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అజిత్‌తో సూప‌ర్‌హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ శివ ర‌జినీకాంత్‌ను ఎలా ప్రెజెంట్ చేయ‌బోతారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

ప్రేయ‌సి ఫొటో షేర్ చేసి షాకిచ్చిన రానా!!

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఈరోజు త‌న స్నేహితుల‌కు, అభిమానుల‌కు పెద్ద షాకే ఇచ్చాడు. ఇంత‌కూ రానా ఇచ్చిన షాకేంటో తెలుసా? ఓ అమ్మాయితో దిగిన ఫొటోను షేర్ చేసిన రానా ఆమె ఓకే చెప్పింది

ప‌వ‌న్ 28లో మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌..?

త‌దుప‌రి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌టంతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా శ‌ర‌వేగంగా సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు.

ఈసారి 'రాములో రాముల..' అంటోన్న డేవిడ్ వార్నర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.

అనారోగ్యంపై వచ్చిన వార్తలపట్ల కేటీఆర్ క్లారిటీ..

తెలంగాణ మంత్రి కేటీఆర్ అనారోగ్యంగా ఉన్నారని.. గత రెండు మూడ్రోజులుగా ఆయన బాధపడుతున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. కేసులు తగ్గిపోతున్నాయ్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇందుకు నిదర్శనమే గత నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసులు.