'2.0' నైజాం హక్కులను దక్కించుకున్న...

  • IndiaGlitz, [Monday,May 22 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మ‌రోసారి రోబో చిట్టిగా త‌న మాయాజాలాన్ని తెర‌పై చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే, ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్నఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల్లో భాగంగా డ‌బ్బింగ్ జ‌రుపుకుంటుంది. విఎఫెక్స్ వ‌ర్క్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే బిజినెస్ ప‌రంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా నైజాం ఏరియా హ‌క్కుల‌ను ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ ఏషియ‌న్ ఫిలింస్ వారు సంపాదించుకున్నారని స‌మాచారం.

More News

బాహుబలికి ఎ.ఆర్.రెహమాన్ ప్రశంస..

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన విజువల్ వండర్ `బాహుబలి-2` 1500 కోట్ల కలెక్షన్స్ను దాటి బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతుంది.

కన్నడ హీరోయిన్ తో ఆది...

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ప్రయత్నాలు చేస్తూనే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో `శమంతకమణి` అనే మల్టీస్టారర్లో నటిస్తున్నాడు.

'దర్శకుడు' టీజర్ విడుదల చేసిన యంగ్ టైగర్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఈషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకుడు.

నిఖిల్ చేతుల మీదుగా ఆదిపినిశెట్టి 'మరకతమణి' టీజర్ విడుదల

'సరైనోడు' లాంటి బ్లాక్బస్టర్ చిత్రంలో వైరం ధనుష్ పాత్రలో అందరిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం "మరకతమణి". ఇటీవలే 'మలుపు' లాంటి కాన్సెప్టెడ్ కమర్షియల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గర్లాని మరోక్కసారి జంటగా చేసిన మరకతమణి టీజర్ ని ఇటీవలే కేశవ చిత్రం తో కలెక్షన్ల రికార్డుల

మెదటి మూడురోజులకి 11.40 కొట్లు వసూలు చేసిన 'కేశవ'

గత మూడేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలన్నీ వైవిద్యంగా వుంటున్నాయి. అంతేకాదు అన్ని చిత్రాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వటమే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ తెచ్చిపెట్టాయి.