close
Choose your channels

'2.O' నిడివి ఎంతంటే..

Friday, January 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివాజీ, రోబో వంటి రెండు వ‌రుస విజ‌యాల త‌రువాత సూపర్ స్టార్ రజనీ కాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా 2.O`. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఎమీ జాక్సన్ కథానాయికగా న‌టించింది. ఎ.ఆర్‌. రెహ‌మాన్‌ స్వరకర్త. భారీ తారాగణంతో.. సూపర్ విజువల్స్‌తో తెరకెక్కిన‌ ఈ సినిమాపై కేవలం దక్షిణాదిలోనేకాక బాలీవుడ్‌లోనూ మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఇప్పటికే చిత్రీకరణని ముగించుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. 3డి ఫార్మాట్‌లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమా నిడివి కేవలం 100 నిముషాలు (1 గంట‌.. 40 నిమిషాలు) మాత్రమే ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, అరబిక్ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.