close
Choose your channels

రెండు ఫార్మేట్స్‌లో '2.0'

Monday, September 10, 2018 • తెలుగు Comments

రెండు ఫార్మేట్స్‌లో `2.0`

ఎప్పుడో ఆగ‌స్ట్‌లో `2.0` టీజ‌ర్ వ‌స్తుంద‌నుకుంటే ఆల‌స్య‌మైందేంటి?  వినాయ‌క చ‌వితికి టీజ‌ర్ వ‌స్తుందో రాదో? అనే సందేహం ఉండేది. అది కూడా ధికారిక స‌మాచారం ఇచ్చే వ‌ర‌కు.. నిర్మాణ సంస్థ `2.0` టీజ‌ర్ గురించి చెబుతూ 2డి, 3డి ఫార్మేట్స్‌లో ఉంటుంద‌ని తెలిజ‌యేసింది. అయితే 3డి ఫార్మేట్ అనేది కొన్ని థియేట‌ర్స్‌ల‌లోనే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. శంక‌ర్ గ‌త చిత్రం 'ఐ'లో క‌థానాయిక‌గా న‌టించిన ఎమీ జాక్స‌న్ ఇందులో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 29న `2.0`న విడుద‌ల చేయ‌బోతున్నారు.