నిప్పురా..! లో న‌టిస్తున్న‌ ర‌జ‌నీ..!

  • IndiaGlitz, [Friday,September 16 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. ఈ చిత్రంలో నిప్పు రా...! అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. త‌మిళ్ లో నెరుప్పు డా అంటే తెలుగులో నిప్పురా అని అర్ధం. ఇప్పుడు నెరుప్పుడా అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు శివాజీ గ‌ణేశ‌న్ మ‌న‌వ‌డు, న‌టుడు ప్ర‌భు త‌న‌యుడు విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరో విక్ర‌మ్ ప్ర‌భు ఫైర్ స‌ర్వీస్ లో వ‌ర్క్ చేస్తుంటాడు. పైగా ర‌జ‌నీ అభిమానిగా న‌టిస్తున్నాడ‌ట‌. అందుచేత ఓ స‌న్నివేశంలో హీరో విక్ర‌మ్ ప్ర‌భుకి త‌న అభిమాన హీరో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ క‌నిపిస్తాడ‌ట‌. ఈ స‌న్నివేశం గురించి ర‌జ‌నీకి చెప్పి మీరు న‌టించాలి అని అడ‌గార‌ట చిత్ర బృందం. శివాజీ గ‌ణేష‌ణ్ కుటుంబంతో ర‌జ‌నీకాంత్ కు మంచి అనుబంధం ఉండ‌డంతో వెంట‌నే ఓకే చెప్పార‌ట. నూత‌న ద‌ర్శ‌కుడు బి.అశోక్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

More News

'ఇజం' రిలీజ్ డేట్ మారనుందా?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇజం`. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

స‌మంతా గ్యారేజ్ లో ఆలీ..!

ఏ సినిమా అయినా విజ‌యం సాధిస్తే...ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తుండ‌డం మామూలే. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తున్నారు.

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న రాజ‌శేఖ‌ర్ కుమార్తె..!

డా.రాజ‌శేఖ‌ర్ - జీవిత దంప‌తుల కుమార్తె శివాని ఎంట్రీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌శేఖ‌ర్ తండ్రిగా శివాని కుమార్తెగా ఓ సినిమా అనుకున్నారు కానీ ఎందుక‌నో ఈ ప్రాజెక్ట్ తెర పైకి రాలేదు.

క్రిస్మస్ క్యూ క‌డుతున్న సినిమాలు ఇవే..!

ద‌స‌రాకి ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క్రిస్మ‌స్ కానుక‌గా సినిమాలు రిలీజ్ చేసేందుకు పోటీప‌డుతున్నారు నిర్మాత‌లు.

చైతు...రెండు సినిమాలు ఒకేసారి

అక్కినేని నాగచైతన్య రెండు సినిమాలు సాహసం శ్వాసగా, ప్రేమమ్ సినిమాలు విడుదలకు సిద్ధమైయ్యాయి. ఇవి విడుదలక కాకమునుపే చైతన్య మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.