close
Choose your channels

ర‌జనీ.. ఓ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌

Wednesday, May 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌జనీ.. ఓ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ద‌ర్బార్‌`. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ముంబై కీల‌క లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. `ద‌ర్బార్` చిత్రాన్ని హిందీలో కూడా అనువాదం చేసి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారట‌.

న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మూవీని విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.