close
Choose your channels

ద‌ర్బార్ షెడ్యూల్ పూర్తి.. త‌దుప‌రి షెడ్యూల్ ఎప్పుడంటే...

Thursday, May 16, 2019 • తెలుగు Comments

ద‌ర్బార్ షెడ్యూల్ పూర్తి.. త‌దుప‌రి షెడ్యూల్ ఎప్పుడంటే...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తుంది. రీసెంట్‌గా షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించిన ఈ చిత్రంలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వేస‌వి కార‌ణంగా త‌దుప‌రి షెడ్యూల్‌కు కాస్త విరామం తీసుకున్నారు. రెండో షెడ్యూల్ మే 29న ప్రారంభ‌మ‌వుతుంది. ఇది కూడా ముంబైలోనే చిత్రీక‌రిస్తున్నారు. అనిరుధ్ సంగీతం.. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz