close
Choose your channels

క‌మ‌ల్ డ్యూయెల్‌..!

Tuesday, September 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌మ‌ల్ డ్యూయెల్‌..!

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న చిత్రం `ఇండియ‌న్ 2`. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 1996లో `ఇండియ‌న్‌` సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు సంబంధించి శంక‌ర్ లొకేష‌న్స్ వేట‌లో ఉన్నార‌ట‌.

ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ చివ‌ర‌లో స్టార్ట్ చేయాల‌నుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇండియ‌న్ త‌ర‌హాలోనే ఇందులో కూడా ఇద్ద‌రు క‌మ‌ల్ హాస‌న్‌లు ఉంటార‌ట‌. అందులో ఒక‌రు ఓల్డ్ క‌మ‌ల్‌హాస‌న్ కాగా..యంగ్ క‌మ‌ల్‌హాసన్ కూడా క‌నిపిస్తార‌ట‌. మ‌రి ఈ పాత్ర ఎంతసేపు ఉంటుంద‌నేది తెలియ‌ద‌లేదు. పార్ట్ వ‌న్‌లో అయితే కొడుకు పాత్ర‌లోని క‌మ‌ల్‌ని ఇండియ‌న్ పాత్ర‌లోని క‌మ‌ల్ చంప‌డంతో ముగిసింది. మ‌రి ఈ సీక్వెల్ అక్క‌డ నుండే స్టార్ట్ అవుతుందా అనేది చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.