Download App

ర‌జ‌నీ యూర‌ప్ షెడ్యూల్ ఉందా? లేదా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చెన్నై షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. దీని త‌ర్వాత యూరప్ షెడ్యూల్ ఉంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా ల‌ఢ‌ఖ్‌లో కూడా సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే యూర‌ప్ షెడ్యూల్‌ను ప్లేస్‌లో ల‌డ‌ఖ్‌లో చేస్తారో.. యూర‌ప్ కంటే ముందుగానే ల‌ఢ‌ఖ్‌లో చిత్రీక‌రిస్తారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

అయితే ల‌ఢ‌ఖ్ షెడ్యూల్ మాత్రం ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ డ్యూయెల్ షేడ్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ప‌గ‌టి వేళ‌లో ఓ హాస్ట‌ల్‌కి వార్డెన్‌గా ఉండే ర‌జ‌నీకాంత్ రాత్రి కాగానే మాఫియా డాన్‌గా మారుతాడ‌ట‌. మ‌రి ఇంత సంఘ‌ర్ష‌ణ ఉండే క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.