డిస్క‌వ‌రీలో ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కేవ‌లం సినిమాలకే ప‌రిమితం కావ‌డం లేదు. త్వ‌ర‌లోనే డిస్క‌వ‌రీ ఛానెల్‌లో ప్ర‌సారం కాబోయే మేన్ వ‌ర్సెస్ వైల్డ్ సిరీస్‌లో క‌నిపించ‌బోతున్నారు. బ్రిట‌న్‌కు చెందిన అడ్వెంచెర‌ర్ బేర్ గ్రిల్స్ ఈ షోను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇబందిపూర్ అట‌వీ ప్రాంతంలో ఈ సిరీస్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. బేర్ గ్రిల్స్‌, ర‌జినీకాంత్ క‌లిసి పులులు తిరిగే ఈ భ‌యంక‌ర‌మైన అట‌వీ ప్రాంతంలో ఆరు గంట‌ల పాటు పర్య‌టించ‌నున్నారు. మంగ‌ళ‌వారం ర‌జినీకాంత్‌తో ఈ సిరీస్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. కాగా.. గురువారం బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్‌తో ఈ డిస్క‌వ‌రీ ఛానెల్ పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని అంటున్నారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ర్వాత ఈ షోలో క‌నిపిస్తున్న స్టార్ సెల‌బ్రిటీ ర‌జినీకాంతే కావ‌డం విశేషం.

గ‌తంలో ప్ర‌ధాని మోదీ, బేర్ గ్రిల్స్ క‌లిసి ఉత్త‌రాఖండ్‌లోని జిమ్ కార్బెట్ అట‌వీ ప్రాంతంలో మేన్ వ‌ర్సెస్ వైల్డ్ షోను చిత్రీక‌రించారు. అప్ప‌ట్లో ఆ షో టాక్ ఆఫ్ ది నేష‌న్ అయ్యింది. మ‌రి ర‌జినీకాంత్ న‌టిస్తున్న ఈ షో ఎప్పుడు ప్ర‌సారం అవుతుంద‌నే విష‌యాన్ని వెల్ల‌డించ‌డం లేదు.

ప్రస్తుతం ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఆలోపు సినిమాల్లోని త‌న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా త‌న 168వ చిత్రాన్ని శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారాయ‌న‌. దీని త‌ర్వాత లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాలో న‌టిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

రీమేక్‌లో దీపిక‌

దీపిక ప‌దుకొనె త‌దుప‌రి చిత్రానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. హాలీవుడ్‌లో అన్నేహ‌తావే, రాబ‌ర్ట్ డి నీరో న‌టించిన చిత్రం ‘ది ఇంట‌ర్న్‌’.

ఏపీ విభజనకు కారణం వైఎస్ జగనే.. తెరపైకి కొత్త వాదన!?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి తెలంగాణ ఎందుకు విడిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదిగో బీకాంలో ఫిజిక్స్ అంటూ అప్పట్లో అందరి నోళ్లలో నానిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్

ఆసక్తి రేపుతున్న 'పలాస 1978' లోని పాత్రలు

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .

ఢిల్లీలో విజయసాయి వర్సెస్ పవన్.. చక్రం తిప్పేదెవరో!?

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న ఎన్టీఆర్!?

అవునా.. ఎన్టీఆర్.. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాడా..? అని ఆశ్చర్యపోతున్నారా..? ఎస్ మీరు వింటున్నది నిజమే.