ర‌జ‌నీ 'కాలా' రిలీజ్ డేట్ (అఫిసియ‌ల్‌)...

  • IndiaGlitz, [Sunday,February 11 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'కాలా'. వండ‌ర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధ‌నుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ముంభై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా ప‌టేక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ర‌జనీకాంత్‌తో 'క‌బాలి' సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు పా రంజిత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో ఏప్రిల్‌లో వ‌స్తుంద‌న్న‌ '2.0' విడుద‌ల ఆల‌స్యం అయిన‌ట్లే మ‌రి. ఇక్కడొక విష‌యాన్ని ప్ర‌స్తావించాలి.

'కాలా' విడుద‌ల‌వుతున్న రోజునే తెలుగులో మ‌హేష్ 'భ‌ర‌త్ అనే నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలు కూడా విడుద‌ల‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.