close
Choose your channels

'కాలా' టీజర్ ఎప్పుడంటే?

Wednesday, February 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే తమిళనాట పండుగ వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆయన సినిమాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే... శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన '2.O' మూవీని తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఆ మ‌ధ్య‌ వెల్లడించింది.

కాని ఇంకా గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమాని ఆగష్టు 15కు వాయిదా వేసారు. దీంతో.. నిరాశ ప‌డ్డ‌ అభిమానులను ఉత్సాహపరచడానికి అన్న‌ట్లుగా.. నిర్మాణానంతర పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న 'కాలా'ను ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్న‌ట్లు ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ ప్ర‌క‌టించారు.

రజనీ, పా.రంజిత్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే... ఈ మూవీ టీజర్‌ను మార్చి 10న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

నానా ప‌టేకర్, ఈశ్వరీ రావు, హ్యుమా ఖురేషి, అంజలి పాటిల్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని... వండర్బేర్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ మొత్తంలో థియేట్రిక‌ల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. తమిళంతో పాటు, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.