close
Choose your channels

ర‌జ‌నీ క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

Monday, November 23, 2015 • తెలుగు Comments

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌లేషియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది. మాఫియా డాన్ గా.. తెల్ల‌టి గ‌డ్డంతో ఓల్డ్ గెట‌ప్ లో ఉన్న ర‌జ‌నీ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  దన్షిక, రిత్వికా, దినేష్‌, కలైయరశన్‌, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ర‌జనీకాంత్ తో ఇదివరకు న‌టించ‌ని నటులు ఈ చిత్రంలో న‌టిస్తుండ‌డం విశేషం. అలాగే సినిమాకి ఎంతో కీల‌క‌మైన విల‌న్ పాత్ర‌కు మ‌లేషియా న‌టుడిని సెలెక్ట్ చేసార‌ట‌.  త‌మిళ్ లో క‌బాలి టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీకి తెలుగులో మ‌హ‌దేవ్ అనే టైటిల్ ఫిక్స్ చేసార‌ట‌. ర‌జ‌నీ ఎంతో న‌మ్మ‌కం పెట్టుకుని చేస్తున్న క‌బాలి చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.