close
Choose your channels

రజనీ కబాలి కథ ఇదే..

Thursday, November 5, 2015 • తెలుగు Comments

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది. ఈ చిత్రం మ‌లేషియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక క‌బాలి క‌థ విష‌యానికి వ‌స్తే...ర‌జ‌నీకాంత్ మాఫియా డాన్. పెళ్లి చేసుకుని..సెటిలైన త‌ర్వాత త‌న కుమార్తెను కిడ్నాప్ చేస్తే మ‌ళ్లీ త‌న పూర్వ ఆశ్ర‌మం మాఫియాలో ప్ర‌వేశించి త‌న కుమార్తెను ఎలా కాపాడుకున్నాడు అనే క‌థాంశంతో క‌బాలి సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. విక్ర‌మ సింహా, లింగా వ‌రుస ప‌రాజ‌య‌ల త‌ర్వాత ర‌జ‌నీ చేస్తున్న ఈ సినిమా పై ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న క‌బాలి ఎలాంటి సంచ‌ల‌నం స్రుష్టిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.