close
Choose your channels

సినిమా షూటింగ్ పూర్తి.. హిమాల‌యాల‌కు ర‌జ‌నీ

Monday, October 14, 2019 • తెలుగు Comments

సినిమా షూటింగ్ పూర్తి.. హిమాల‌యాల‌కు ర‌జ‌నీ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న 167వ సినిమా `ద‌ర్బార్‌` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టిలా తాను సంద‌ర్శించే హిమాల‌యాల‌ను చేరుకున్నారు. చెన్నై నుండి డెహ్రాడూన్ చేరుకుని అక్క‌డ కాసేపు విశ్రాంతి తీసుకుని హిమాల‌యాల‌కు చేరుకుంటారాయ‌న‌. ఐదు రోజులు అక్క‌డే గ‌డిపి మ‌ళ్లీ తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతార‌ట‌. నిజానికి న‌వంబ‌ర్‌లో ర‌జ‌నీ హిమాల‌యాల‌కు వెళ్లాల్సింది.. కానీ కొత్త సినిమా చేయాల్సి ఉండ‌టంతో ముందుగానే ర‌జ‌నీ, హిమాయ‌ల‌కు బ‌య‌లుదేరారు. 168కి గ్రీన్ సిగ్నల్‌

ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టి నుండో పూర్తిస్థాయి రాజకీయాల‌తో బిజీగా మారుతార‌ని ఆయ‌న అభిమానులు అనుకున్నారు. అయితే ఆయ‌న త‌న‌కున్న క‌మిట్‌మెంట్ ప్ర‌కారం మ‌రో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించబోయే ఈ సినిమాను డైరెక్ట‌ర్ శివ తెర‌కెక్కిస్తారు. తెలుగులో ద‌రువు, శౌర్యం, శంఖం చిత్రాల‌ను తెర‌కెక్కించిన శివ‌, త‌మిళంలో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఇప్పుడు ర‌జ‌నీకాంత్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. హీరోల‌ను మాస్ కోణంలో చ‌క్క‌గా ఆవిష్క‌రించే శివ‌, ర‌జ‌నీకాంత్‌ను ఎలా ఆవిష్క‌రిస్తార‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ఈ సినిమాను న‌వంబ‌ర్‌లోనే ప్రారంభించే అవ‌కాశాలున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz