close
Choose your channels

రజనీ కొత్త సినిమా టైటిల్‌ ఏంటంటే?

Saturday, November 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రజనీ కొత్త సినిమా టైటిల్‌ ఏంటంటే? 

ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌' సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారో లేదో.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన 168వ చిత్రాన్ని వెంటనే ప్రకటించారు. డైరెక్టర్‌ శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.హీరోలను మాస్‌గా చూపించడంలో శివ స్పెషలిస్ట్‌. అందుకనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్‌ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్‌తో శివ సినిమా అనగా మాస్‌ ఇమేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

రజనీకాంత్‌తో శివాజీ, రోబో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రజనీకాంత్‌తో మంజు వారియర్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తారని కూడా వార్తలు వినిపించాయి. మరి శివ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ పెడతాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎప్పటిలాగానే శివ తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వి అరజనీకాంత్‌తో మంజు వారియర్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తారని కూడా వార్తలు వినిపించాయి. మరి శివ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ పెడతాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎప్పటిలాగానే శివ తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వి అక్షరం వచ్చేలా వ్యూహం అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నాడని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. రజనీకాంత్‌ `దర్బార్‌` చిత్రం సంక్రాంతికి విడుదల కాగానే.. వ్యూహం సినిమా వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారట నిర్మాతలు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.