రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖ‌రారు

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ డిసెంబ‌ర్ 31న త‌న రాజ‌కీయ పార్టీ పేరుని అనౌన్స్ చేసి జ‌న‌వ‌రిలో పార్టీని ప్రారంభిస్తాన‌ని ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అస‌లు ర‌జినీకాంత్ త‌న పార్టీకి ఏ పేరు పెడ‌తారోన‌ని, ఎలాంటి గుర్తును ఎన్నిక‌ల చిహ్నంగా తీసుకుంటారోన‌ని ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

వివ‌రాల మేర‌కు ర‌జినీకాంత్ త‌న పార్టీ పేరును ‘మ‌క్క‌ల్ సేవై క‌ట్చి’ (అంటే ప్ర‌జ‌ల‌కు సేవ చేసే పార్టీ అని అర్థం) నిర్ణ‌యించారట‌. అలాగే పార్టీ గుర్తుగా ఆటోరిక్షాను ఎన్నిక‌ల సంఘం ఖ‌రారు చేసింద‌ని అంటున్నారు. ఈ స‌స్పెన్స్‌కు తెర వీడాలంటే డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆగాల్సిందే.

ఈలోపు ర‌జినీకాంత్ త‌న పూర్తి చేయాల్సిన సినిమా ‘అణ్ణాతే’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. కోవిడ్ ప్ర‌భావం కార‌ణంగా ఆరేడు నెల‌లుగా ఆగిపోయిన సినిమా కోసం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ వేశారు. ర‌జినీకాంత్‌తో పాటు న‌య‌న‌తార కూడా హైద‌రాబాద్ చేరుకున్నారు. లాంగ్ షెడ్యూల్‌ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా పూర్తి చేయాల‌నేది ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది.

More News

రాజ‌మౌళి ఏంటి ఇలా చేశాడు.. టెన్ష‌న్‌లో మెగా ఫ్యాన్స్‌?

మెగాఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారా! అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తుంది. ఇంత‌కీ మెగా ఫ్యాన్స్ టెన్ష‌న్‌కు కార‌ణం ఎవ‌రు?

బీజేపీలోకి తెలంగాణ మంత్రి తమ్ముడు..!?

తెలంగాణలో టీఆర్ఎస్‌కు పెద్ద షాకులే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

గుడ్ మార్నింగ్.. హైదరాబాద్’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఈ పాట హౌస్‌మేట్స్‌లో ఫుల్ జోష్ నింపింది.

రాజ‌కీయాల్లోకి విశాల్‌..!

తెలుగు ప్రేక్ష‌కులకు సుప‌రిచితుడైన తమిళ హీరో విశాల్ రాజ‌కీయ రంగ ప్రవేశం చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ మీడియాకు తెలియ‌జేశాడు.

2020 రికార్డ్ ‘వకీల్‌సాబ్’దే

2020.. చాలా కాలం తర్వాత ప్రపంచాన్ని వణికించింది. ఎక్కడికక్కడ స్తంభింపజేసింది. ఈ ఏడాది ఒక్కొక్కరికీ ఒక్కో ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఇక సినీ ప్రపంచం అయితే ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికీ కోలుకోలేదు.