ఘనంగా రజినీకాంత్ 'పేట' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

  • IndiaGlitz, [Monday,January 07 2019]

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రం ' పేట'.. సిమ్రాన్ , త్రిష లు కథానాయికలు.... సాంగ్స్, ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది..కాగా ఈకార్యక్రమానికి చిత్ర బృందం తో పాటు హీరో శ్రీకాంత్, దర్శకుడు వైవీఎస్ చౌదరి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. 

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. నవాబ్, సర్కార్ లాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ వల్లభనేని అశోక్  గారికి రజినీకాంత్ గారు నటించిన ఈ సినిమా కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను.. పెద్ద పెద్ద సినిమాలతో పోటీపడుతూ సంక్రాంతి కి వస్తున్న ఈ సినిమా బాగా ఆడాలి కోరుకుంటున్నాను.... మా ఆర్టిస్టులందరికి రజినీకాంత్ గారు చాల ఇన్స్పిరేషన్..సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా బాగా ఆడాలి అన్నారు.. 

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. రజినీకాంత్ గారి కి పాటలు రాసే అవకాశం వచ్చినందుకు చాల ఆనందంగా ఫీల్ అవుతున్నాను.. అయన పాటల్లో మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా నేను మంచి పాట రాసినందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను.. ఎంతో ఉత్సాహంతో పాట రాశాను.. మంచి సంతృప్తి కలిగించింది.. రజినీకాంత్ గారు చాల బాగా కనిపించరు..ఈ సినిమా ద్వారా వల్లభనేని అశోక్ గారికి మంచి లాభాలు రావాలని కోరుతున్నాను అన్నారు.. 

దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ , ఆసక్తి కలిగిన నిర్మాత వల్లభనేని వంశీ.. టాలీవుడ్ లో దియేటర్ల సమస్య ఉన్నా కూడా అలాంటి టైం లో స్టార్ కాస్ట్ ని , సినిమా పట్ల ఇష్టంతో సినిమా లు రిలీజ్ చేస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.. అయన చేసిన పెద్ద సాహసం ఇది..ఇక ఈ సినిమా తో పూర్వపు రజినీకాంత్ గారిని చూస్తున్నాను అనుకుంటున్నాను.. కార్తీక్ సుబ్బరాజు గారు ఆయన్ని చాల బాగా ప్రజెంట్ చేశారు.. నటీనటులను కూడా దమ్మున్న నటీనటులను ఎంచుకున్నారు.. అందరు కథను నమ్మి సినిమా చేసేవాళ్ళు.. అలాంటి వాల్లన్ను ఈ సినిమా కు ఒప్పించడమంటే అక్కడే సినిమా సూపర్ హిట్ అని అర్థమవుతుంది.. ఈ సినిమా తప్పక బాగుంటుంది.. అందరు ఆదరించాలి అని అన్నారు.. 

నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ... రజినీకాంత్ గారి స్పూర్తితోనే అయన సినిమా చేసే స్థాయికి చేరుకున్నాను.. సినిమా థియేటర్ ల విషయంలో చాల మంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. వాళ్లకు ఈ సినిమా హిట్ తో బుద్ధి చెప్పాలనుకుంటున్నాను..దయచేసి ఈ సమస్య ను పరిష్కరించాలని కెసిఆర్ గారిని కోరుకుంటున్నాను అన్నారు.. 

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ... ఈ సినిమా ని తెలుగులో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ అశోక్ గారికి కంగ్రాట్స్.. ఈ సినిమా రజిని ఫాన్స్ కోసమే.. అయన ఇరగదీశారు.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి చాల థాంక్స్.. ఈ సినిమా కి పనిచేసిన అందరు లిరిసిస్ట్స్ చాల బాగా పనిచేశారు. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్.. ఈ సినిమా అందరికి నచ్చుతుంది.. థియేటర్స్ లో అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.. 

హీరోయిన్ మేఘ ఆకాష్ మాట్లాడుతూ.. ఇంత గొప్ప సినిమా లో నాకు అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి, సన్ పిక్చర్స్ వారికి చాల థాంక్స్.. సినిమాలో నాకు మంచి పాత్ర వచ్చింది. సినిమాలో అందరితో నటించే అవకాశం వచ్చినందుకు హ్యాపీ గా ఉంది.. దియేటర్ కి వెళ్లి ఈ సినిమా ని ఎంజాయ్ ని చేయండి అన్నారు..

నటుడు బాబీ సింహ మాట్లాడుతూ.. రజిని గారితో పనిచేశాననే ఆలోచనే నాకు ఎంతో సర్ ప్రైజింగ్ గా ఉంది.. దేవుడిని చుశాననే ఫీలింగ్ కలిగింది.. కార్తీక్ గారు ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు చాల థాంక్స్.. అయన మంచి డైరెక్టర్.. ఆయన చేసిన సినిమాలు అయన ఏంటో చెప్తాయి..  అనిరుధ్ గారితో పనిచేయడం మరిచిపోలేనిది.  అన్నారు.. 

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మాట్లడుతూ.. నామొదటి సినిమా పిజ్జా కోసం హైదరాబాద్ వచ్చాను.. మళ్ళీ రజినీకాంత్ గారి సినిమా కు రావడం చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమాకి కష్టపడి పనిచేసిన అందరికి ధన్యవాదాలు.. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న అశోక్ గారికి కంగ్రాట్స్.. సినిమా చాల బాగుంటుంది.. ఫ్యామిలీ ఓరియెంటెడ్ , యాక్షన్ ఫిలిం ఇది.. మీ అందరు ఈ సినిమా ను చాల బాగా ఎంజాయ్ చేస్తారు..మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.. అందరు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అన్నారు..

More News

బాల‌య్య‌ కామెంట్ 2 ...నాగ‌బాబు రిప్లై..

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను విమ‌ర్శించిన బాల‌కృష్ణ ఆరు సంద‌ర్భాల్లో త‌క్కువ చేస్తూ మాట్లాడ‌ర‌న్న నాగ‌బాబు. దానికి సంబంధించిన రెండో కామెంట్ వీడియో విడుద‌ల చేశారు.

విజ‌య్, అట్లీకి మూహూర్తం కుదిరింది. 

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ తన తదుపరి చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో చేయుబోతున్న సంగతి తెలిసిందే.

నిర్మాతల కోసం మ్యాస్ట్రో ముంద‌డుగు

ఇసై జ్ఞాని, మ్యాస్ట్రో ఇలా అందరూ వారి అభిమానానికి తగ్గట్లుగా ఇళయరాజాను పిలుచుకుంటూ ఉంటారు

డిప్రెషన్‌కు కారణాన్ని వివ‌రిస్తున్న క‌త్రినా కైఫ్‌...!

‘నేటి యువత వాస్తవ ప్రపంచంలో లేరు. ఎక్కువ శాతం మంది ఊహాలోకంలోనే ఉంటున్నారు.

'హుషారు’ రీవేుక్

తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్, అభినవ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమల్, రాహుల్ రావుకృష్ణ తారాగణంగా రూపొందిన చిత్రం 'హుషారు'.