తలైవా ఎంట్రీ ఫిక్స్.. జనవరిలో పార్టీ లాంచ్

తమిళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అసలు వస్తారా.. లేదంటే అనారోగ్య కారణాల కారణంగా ఆగిపోతారా? అనేవి కొంత కాలంగా తమిళ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ క్లారిటీ వచ్చేసింది. రజినీ రాజకీయ ఆరంగేట్రం కన్ఫర్మ్ అయిపోయింది. ట్విట్టర్ వేదికగా తన పొలిటికల్ ఎంట్రీని తలైవా ప్రకటించేశారు. డిసెంబర్ 31న పార్టీకి సంబంధించిన వివరాలన్నీ వెల్లడిస్తానని రజినీ ప్రకటించారు. జనవరిలో పార్టీని లాంచ్ చేయనున్నట్టు రజినీ ట్వీట్‌లో వెల్లడించారు.

రజినీకాంత్ ఇటీవల తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే రజనీకాంత్ సొంత పార్టీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అదే రోజు రజినీ వెల్లడించారు. ఆ సమావేశానంతరం రజినీ మీడియాతో మాట్లాడుతూ.. మక్కల్ మండలం కార్యదర్శులు, నిర్వాహకులు తమ తరుఫు నుంచి లోటుపాట్లను వివరించగా.. తాను సలహాలిచ్చినట్టు వెల్లడించారు. రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం గురించిన ప్రకటన నేడు తప్పక వస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది.

అయితే సమావేశంలో రజినీ మాట్లాడిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. జనవరిలో పార్టీ ప్రారంభిస్తే మీరు రెడీగా ఉన్నారా? అని రజినీ నాటి సమావేశంలో అభిమానులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు ఏమాత్రం బాగోలేదని పేర్కొన్నట్టు సమాచారం. మీరు కష్టపడితేనే మనం తరువాతి మెట్టు ఎక్కగలమన్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న విషయంలో మాత్రం సూపర్ స్టార్ ఓ నిర్ణయానికి ఇంకా రాలేదని సమాచారం. అయితే ఈ సమావేశం జరుగుతుండగానే సమావేశ మందిరం బయట ఉన్న అభిమానులు మాత్రం బీజేపీతో పొత్తు వద్దంటూ నినాదాలు చేయడం గమనార్హం. నాటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే రజినీ పొత్తుల జోలికి వెళ్లరని తెలుస్తోంది.

More News

నా ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి: వరలక్ష్మి శరత్‌కుమార్

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

దుల్కర్‌తో సినిమా.. భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిన పూజా హెగ్డే..

అనతి కాలంలో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే.

చివరి గంటే కీలకం..

జీహెచ్ఎంసీ పోలింగ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. దాదాపు ఏ ఎన్నికల్లో అయినా 12 గంటల లోపు ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది.

టైటిల్ విషయంలో క్రిష్ క్లారిటీకి వచ్చేశాడా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు క‌రోనా వైర‌స్ పెద్ద షాకే ఇచ్చింది.

ర‌వితేజ‌కు విల‌న్‌గా మారిన హీరో

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ర‌వితేజ‌..