ర‌జినీ పొలిటిక‌ల్ అనౌన్స్‌మెంట్ అప్పుడేనా?

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ర‌జినీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు కానీ.. ఎప్పుడ‌నేది మాత్రం చెప్ప‌లేదు. అస‌లు ర‌జినీకాంత్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎప్పుడొస్తారా ? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయ‌న మాత్రం త‌న సినిమాల‌ను చేసుకుంటూ పోతున్నారు. కానీ త‌న పార్టీ గురించి ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ర‌జినీకాంత్ రాజ‌కీయ పార్టీని అనౌన్స్ చేయ‌డానికి సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ఏప్రిల్‌లో అనౌన్స్ చేయాల‌ని అనుకుంటే ఆలోప‌లే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప్రారంభ‌మైంది. ఆగ‌స్ట్‌లోపు ప‌రిస్థితులు చ‌క్క బ‌డ‌తాయ‌ని అనుకుంటే ఇంకా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌టానికి స‌మయం ప‌ట్టేలానే ఉంది. దీంతో న‌వంబ‌ర్‌లో త‌న పార్టీ పేరుని, విధి విధాల‌ను ర‌జినీకాంత్ ప్ర‌క‌టిస్తార‌ట‌.

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు మే 2021లో జ‌ర‌గ‌నున్నాయి. ఆలోపు పార్టీని అనౌన్స్ చేసుకుని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ర‌జినీకాంత్ సినిమాల పరంగా త‌న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసేస్తున్నారు. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ‌ల్ పెద్ద‌గా మార్పులు చూప‌లేదు. కానీ.. ర‌జినీ ఎంట్రీ ఎలా ఉండబోతుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న మాస్ ఇమేజ్‌తో త‌మిళ రాజ‌కీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తారా అనే ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

More News

ఓటీటీలో త‌మ‌న్నా, కాజ‌ల్ సినిమా!!

2014లో హిందీలో వచ్చిన ‘క్వీన్’ సినిమా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఐదేళ్ల త‌ర్వాత అదే డైరెక్ట‌ర్‌తో సందీప్‌....

ప్ర‌స్థానం సినిమాతో న‌టుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సందీప్ కిష‌న్ అటు త‌మిళం, ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు సందీప్‌.

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఊరట

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నేడు ఎన్నంటే..

ఏపీలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.