నేను చెప్తున్నా... సూప‌ర్ డూప‌ర్ హిట్ అంతే! - ర‌జ‌నీకాంత్‌

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

2.0 ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌లో ర‌జ‌నీకాంత్ మాట్లాడారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టించిన చిత్ర‌మిది.

చెన్నైలో
ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ '' ఆల్ ఇండియా మీడియాను ఒక రూఫ్ కింద చూడ‌టం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది. సుభాష్‌క‌ర‌ణ్‌కి, శంక‌ర్‌కి అడ్వాన్స్ కంగ్రాట్స్. నిర్మాత 600 కోట్లు పెట్టారు. శంక‌ర్‌ని న‌మ్మి పెట్టారు. అంతేగానీ నా మీదో, అక్ష‌య్‌కుమార్ మీదో కాదు. ఆడియ‌న్స్ ఎక్స్ పెక్టేష‌న్స్, నిర్మాత‌ల ఎక్స్ పెక్టేష‌న్స్ ని ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉన్నారు శంక‌ర్‌. కొన్నిసార్లు త‌ప్పి ఉండ‌వ‌చ్చు. అయినా అత‌ను మెజీషియ‌న్‌. అత‌ను చాలా గొప్ప డైర‌క్ట‌ర్‌. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్ అని నేను చెప్ప‌డం లేదు. అంద‌రూ క‌ష్ట‌ప‌డ‌తారు. అయినా అన్నీ సార్లు వ‌ర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వ‌ర్క‌వుట్లు అవుతాయి.

ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు మోర్ ప్ర‌మోష‌న్లు అవ‌స‌రం లేదు. అస‌లు ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని చాలా మంది ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను ప్ర‌మోట్ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా త‌ప్పకుండా ఎంక‌రేజ్ చేస్తారు. చిల్డ్ర‌న్‌కీ, ఇంట‌లెక్చువ‌ల్స్ కీ, సూడో ఇంట‌లెక్చువ‌ల్స్ కీ న‌చ్చుతుంది. ఇందులో అన్ని అంశాలున్నాయి. ఈ విశ్వం మాన‌వుల‌కు మాత్ర‌మే కాదు. ప‌శుప‌క్ష్యాదుల‌కు కూడా. అలాంటి ప‌లు విష‌యాల‌ను, సందేశాత్మ‌కంగా చెప్పారు శంక‌ర్‌. ప‌ర్యావ‌ర‌ణాన్ని, సొసైటీని మోడ్ర‌న్ టెక్నాల‌జీ ఎలా స్పాయిల్ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంక‌ర్‌గారు ఏమ‌నుకున్నారో దాన్ని తేగ‌ల స‌త్తా ఆయ‌న‌కుంది. అందుకే ఆయ‌న క‌థ చెప్పిన‌ప్పుడు 'ఇదెలా వ‌ర్కవుట్ అవుతుంది?' అని గానీ, ఇంకేమీ గానీ అడ‌గ‌లేదు. ఎవ‌రు నిర్మిస్తు్నారు అని మాత్రం అడిగాను.

'శివాజీ' సినిమా చేసేట‌ప్పుడు ఆ సినిమాకు అనుకున్న బ‌డ్జెట్ క‌న్నా రెట్టింప‌యింది. విడుద‌ల స‌మ‌యంలో ఇంకా ఎక్కువైంది. కానీ ఆ సినిమాకు అంత క‌న్నా ఎక్కువ మొత్తం క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. 'శివాజీ' ఎంత క‌లెక్ట్ చేసిందో, అంత బ‌డ్జెట్ వేశారు 'రోబో'కి. స‌న్ పిక్చ‌ర్స్ వాళ్లు.. దానిక‌న్నా 20-30 ప‌ర్సెంట్ బ‌డ్జెట్ ఎక్కువ‌యింది. అయినా క‌లెక్ట్ అయింది. 'రోబో' క‌లెక్ట్ చేసినంత ఈ సినిమాకు వ‌స్తే చాలు అని '2.0' మొద‌లుపెట్టాం. అందుకే ముందు రూ.300కోట్లు అనుకున్నాం. ఇప్పుడు డ‌బుల్ అయింది. త‌ప్ప‌కుండా అంత‌కు డ‌బుల్ క‌లెక్ట్ చేస్తుంది. 'క‌బాలీ' ఒక షెడ్యూల్ చేసిన త‌ర్వాత నాకు అనారోగ్యం వ‌చ్చింది. '2.0'కోసం 5 రోజులు షూట్ చేశా. 7, 8 రోజులైంది. అప్ప‌టికే నాకు ఆత్మ‌విశ్వాసం పోయింది. 'నేను జ‌స్టిఫై చేయ‌లేను. ఖ‌ర్చుపెట్టిందంతా ఇచ్చేస్తాను. నేను చేయ‌లేను' అని శంక‌ర్‌ని పిలిచి చెప్పా. ' మీరు జ‌స్ట్ అలా రండి. మీరు క‌న్ను చూపించండి.. మిగిలింది మొత్తం మ‌నం చేద్దాం' అని అన్నారు.

బాడీ సూట్ వ‌ద్దు అని అన్నారు. కానీ నేనే.. ఆ బాడీ సూట్ నేను వేసుకుంటా అని అన్నాను. 'క‌బాలీ' మ‌లేషియాకి వెళ్లిన‌ప్పుడు ఆరోగ్యం ఇంకా చాలా పాడ‌యింది. అప్పుడు డాక్ట‌ర్ నాలుగైదు నెల‌లు రెస్ట్ కావాల‌న్నారు. ఆ విష‌యం నిర్మాత‌కు తెలిసి మా ఇంటికి వ‌చ్చి 'నాలుగు నెల‌లు కాదు, నాలుగు సంవ‌త్స‌రాలు వెయిట్ చేస్తా. నాకు డ‌బ్బులు కాదు. మీతో సినిమా ముఖ్యం' అని అన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్ దొర‌క‌డం, ఓ కోహినూర్ డైమండ్ దొరికిన‌ట్టు. ఈ ప్ర‌పంచంలో నాకు మంచి ఫ్రెండ్ దొరికారు. శంక‌ర్ త్వ‌ర‌లో క‌మ‌ల్‌హాస‌న్‌తో చేసే 'ఇండియ‌న్‌2' చాలా గొప్ప‌గా ఉంటుంది. ఈ సినిమా చాలా లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది అని చాలా మంది అడిగారు. కానీ కాస్త లేట్ అయినా, క‌రెక్ట్ గా రావాలి. వ‌స్తే, ష్యూర్‌గా కొట్టాలి. నేను.. సినిమా గురించి చెప్పాను. సినిమా గురించి మాత్ర‌మే చెప్పా. ప్ర‌జ‌లు న‌మ్మారు. హిట్ అని నిర్ణ‌యించారు. రిలీజ్ చేయ‌డ‌మే బాకీ.

ఈ సినిమాను, త‌మిళ్ ఇండ‌స్ట్రీని ప్యాన్ ఇండియా స్థాయిని మించి ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి తీసుకెళ్లారు శంక‌ర్‌. శంక‌ర్‌, రాజ‌మౌళి, రాజ్‌కుమార్ హిరానీ లాంటివారు జెమ్స్ ఆఫ్ ఇండ‌స్ట్రీ. వాళ్లంద‌రినీ చాలా గొప్ప‌గా చూసుకోవాలి. నీర‌వ్ షా చాలా ఈజ్‌తో చేశారు. నీర‌వ్‌షా చూడ్డానికి, ఆయ‌న చేసే ప‌నికీ సంబంధ‌మే ఉండ‌దు. ఎమీ జాక్స‌న్ మొత్తం ఆ సూట్‌లోనే ఉండేవారు. అక్ష‌య్‌కుమార్‌కి హ్యాట్సాఫ్‌. ఆయ‌న్ని ఢిల్లీలో చూసిన‌ప్పుడు నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఆస్కార్ రెహ్మాన్‌కే ఈ సినిమా రీరికార్డింగ్ చేయ‌డం చాలా ఛాలెంజ్‌. అసిస్టెంట్ డైర‌క్ట‌ర్లు పడ్డ క‌ష్టం చాలా గొప్ప‌ది. శంక‌ర్‌గారు చాలా గొప్ప స్థాయికి వెళ్లాలి'' అని అన్నారు.

More News

'2.0' శంక‌ర్ చెప్పిన విశేషాలు..

2.0కి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌జ‌నీకాంత్‌, ఎమీజాక్స‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ శ‌నివారం చెన్నైలో జ‌రిగింది.

'2.0' గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌ర‌ణ‌..

2.0లో వాడిన 4డీ గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌రించారు. శ‌నివారం చెన్నైలో జ‌రిగిన '2.0' ట్రైల‌ర్ లాంచ్‌లో ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌ ర‌సూల్ పూకొట్టి

'2.0' త్రీడీ కాదు.. ఫోర్ డీ సినిమా

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్ వ‌చ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్, క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో సుభాష్ క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫోర్ డీ.. అంటే ఏంటంటే?.. శంక‌ర్ వివ‌ర‌ణ‌

'2.0' టీజ‌ర్‌ను శ‌నివారం 4డీలో విడుద‌ల చేశారు.  4డీ గురించి ద‌ర్శ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ ''ఈ సినిమా క‌థ‌ను రాసేట‌ప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వ‌స్తేనే బావుంటుంద‌ని అనుకున్నా.

'2.0' గురించి రెహ‌మాన్ స్పీచ్‌!

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా '2.0'. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌లో సంగీత ద‌ర్శ‌కుడు రెహ‌మాన్ మాట్లాడారు.