close
Choose your channels

Lal Salaam:సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో ‘లాల్ స‌లాం’.. రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

Wednesday, March 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్ ఇండియా ఆశ్చ‌ర్య‌పోయేలా భారీ బ‌డ్జెట్ విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాలే కాదు.. వెరైటీ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తి చూపించే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ‌లో ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లాల్ సలాం’ సినిమా రూపొందుతోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హోలీ సంద‌ర్భంగా సోమ‌వారం రోజున ప్రారంభ‌మైంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన సినిమాలకు లైకా ఎప్పుడూ ఆద‌ర‌ణ ఇస్తుంది. అందులో భాగంగా లాల్ స‌లాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ వ‌ప‌ర్‌ఫుల్ పాత్ర ఉంది. దాన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లే గొప్ప న‌టుడు కావాల‌ని, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధంతో ఆయ‌న ఈ రోల్‌లో న‌టించ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టారు. మ‌రో లాల్ స‌లాం వంటి డిఫరెంట్ మూవీతో మ‌నల్ని అల‌రించ‌బోతున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు’’ అని తెలిపారు.

నటీనటులు: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.