close
Choose your channels

అభిమానికి సూపర్ స్టార్ స్వీట్‌ వార్నింగ్‌

Saturday, October 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అభిమానికి తలైవా స్వీట్‌ వార్నింగ్‌

రజనీకాంత్‌ ఓ అభిమానికి సుతిమెత్తటి వార్నింగ్‌ను ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే.. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటునారు. ఆయన కూడా సినిమాల్లో తనకున్న కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసి రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయడంలో భాగంగా చేతిలో ఉన్న సినిమాలను చక చకా పూర్తి చేసేస్తున్నాడు సూపర్‌స్టార్‌. రీసెంట్‌గా దర్బార్‌ సినిమా షూటింగ్‌ను తలైవా పూర్తి చేసేశాడు. వెంటనే సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు.

ఆ సినిమా ప్రీ  ప్రొడక్షన్‌ పనులు మొదలవుతున్నాయి. ఈలోపు ఆయన హిమాలయాలకు వెళ్లారు. తన ఇష్టదైవం బాబాను దర్శనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి తిరిగి  చెన్నై చేరుకున్నారు. ఆయన్ని చూసిన అభిమానులు ఊరుకుంటారా! చుట్టు ముట్టేశారు. అక్కడ నుండి ఆయన బౌనర్స్‌ సాయంతో బయటకు వచ్చేశారు. అయితే ఆయనతో ఫొటో దిగాలనుకున్న ఓ అభిమాని మాత్రం బైక్‌లో ఆయన్ని ఫాలో అవుతూ వచ్చాడట. ఈ విషయాన్ని గమనించిన రజనీకాంత్‌ ఇంటికి వెళ్లగానే వాచ్‌మెన్‌ ద్వారా సదరు అభిమానిని లోపలికి పిలిపించాడట. రాత్రి సమయంలో ఇంత వేగంగా టు వీలర్‌ డ్రైవింగ్‌ చేయడం మంచి కాదు.. ఇకపై ఎప్పుడూ అలా చేయకు అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడట.  కేవలం వార్నింగ్‌ ఇవ్వడమే కాదు.. ఆ అభిమానితో ఫొటో కూడా దిగాడట తలైవా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.