సడెన్ డెసిషన్.. హెల్త్ చెకప్ కోసం యుఎస్ కి రజని


Send us your feedback to audioarticles@vaarta.com


సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాతే' చిత్రంలో నటిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ ఈ చిత్రానికి దర్శకుడు. కొన్ని నెలల క్రితం వరకు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఆ సమయంలో కోవిడ్ నేపథ్యంలో రజని తీసుకున్న కేర్ గురించి వార్తల్లో కూడా వచ్చింది.
ఇదీ చదవండి: నటుడు బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల బంపర్ ఆఫర్.. ట్విస్ట్ ఏంటంటే..
దర్శకుడు మాత్రమే సెట్ లో తన దగ్గర ఉండేలా చూసుకున్నారు. సన్నివేశంలో అవసరం అయితేనే ఇతర నటీనటులు దగ్గరగా ఉండాలి. లెకుంటే భౌతిక దూరం పాటించాలి. ఇలాంటి నిబంధనలన్నీ రజని పాటించారు. అయినప్పటికీ అన్నాతే చిత్ర యూనిట్ లో నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీనితో రజని సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లారు.
రజనీకి కోవిడ్ సోకలేదు. కానీ అప్పుడప్పుడూ చిన్న ఆరోగ్య సమస్యలు రజనీని వెంటాడుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా రజని అమెరికాకు పయనం కాబోతున్నట్లు తెలుస్తోంది. సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారట. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అని అంటున్నారు. ప్రత్యేక విమానంలో రజనీ యుఎస్ బయలుదేరనునట్లు తెలుస్తోంది.
అలాగే యుఎస్ లో గ్రే మ్యాన్ షూటింగ్ లో ఉన్న తన అల్లుడు ధనుష్ ని కూడా కలుసుకుంటాడట. అన్నాతే చిత్రంలో రజనికి జోడిగా నయనతార నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments