ర‌జ‌నీ `ద‌ర్బార్` షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Friday,October 04 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం నిర్మించిన చిత్రం 'ద‌ర్బార్‌'. క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి విల‌న్‌గా క‌నిపించ‌బోత‌న్నాడు. ఇంత‌కు ముందు కాలాలో నానా ప‌టేక‌ర్ .. పేట చిత్రంలో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ వంటి బాలీవుడ్ న‌టులు ర‌జ‌నీకాంత్‌కి ప్ర‌తి నాయ‌కులుగా న‌టించారు. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి విల‌న్‌గా వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే మ‌ల‌యాళ న‌టుడు చెంబ‌న్ వినోద్ జోష్‌తో పాటు బాలీవుడ్ న‌టులు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌, ద‌లీప్ తాహిల్ కూడా ఇందులో న‌టిస్తున్నారని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అనిరుధ్ సంగీతం.. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

More News

సైరా యూనిట్‌కి అల్లు వారి పార్టీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`

'లైఫ్ స్టైల్ ' ఫస్ట్ లుక్ లాంచ్

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వకుళాభరణం మోహనకృష్ణ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

ఇస్మార్ట్‌పై బాలీవుడ్ క‌న్ను

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు హ్యూజ్ హిట్ సాధించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంక‌ర్` ఒక‌టి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌,

'మామాంగం' నవంబర్ 21న రిలీజ్‌

భారత దేశం  సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి.

కొత్త ఇల్లు క‌ట్టుకుంటున్న బ‌న్నీ.. పేరేంటో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త‌ ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.