లయన్ మిన్నా? రజనీ చిన్నా?
Send us your feedback to audioarticles@vaarta.com
బలాబలాలు, చిన్నాపెద్దల గురించి చర్చలు సాగుతున్నాయి. యానిమేటెడ్ లయన్ కన్నా, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎందులో చిన్న అని తమిళతంబిలు కస్సుమంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన `2.0` ఇదివరకే మన దేశంతో పాటు చాలా దేశాల్లో విడుదలైంది. చైనాలో జూలై 12న విడుదల కానున్నట్టు ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగింది.
బాలీవుడ్లో పలు సినిమాలను తీసుకుని చైనాలో విడుదల చేసిన హెచ్.వై మీడియా ద్వారా చైనాలో విడుదలవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా హెచ్.వై మీడియా `2.0` విడుదల చేయట్లేదని చెప్పినట్టు వినికిడి.
మిడిల్ డ్రాప్‌కు కారణాలేంటని ఆరా తీసిన వాళ్లకు `లయన్ కింగ్` అని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా `ది లయన్ కింగ్` జులై 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కేవలం వారం రోజుల ముందు మాత్రమే `2.0`ను విడుదల చేయడం వల్ల పెద్దగా లాభాలేం వచ్చే అవకాశాలు లేవని ఈ సంస్థ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే `ది లయన్ కింగ్` కంటెంట్ ఎవరికీ తెలియనిదేమీ కాదు. ఒకసారి సీరీస్‌గా వచ్చింది. మరోసారి 2డీలో వచ్చింది. తాజాగా త్రీ డీ వెర్షన్లో రానుంది.
సూపర్‌స్టార్‌గా పేరున్న రజనీ కాంత్ సినిమా కన్నా, లయన్ కింగ్కున్న క్రేజ్ గొప్పదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని విశ్లేషకుల భావన.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.